దగా చేసిన ప్రియుడిపై యాసిడ్ పోసి..

  0
  178

  ప్రేమించి, తనతో సహజీవనం చేసిన ప్రియుడు మోసం చేయడంతో , జయంతి అనే యువతి అతడిపై యాసిడ్ పోసి , కత్తితో పొడిచింది. తరువాత తాను కూడా విషం తాగింది. కోయంబత్తూరులో జరిగిన ఈ ఘటనలో , గాయపడిన ఇద్దరినీ హాస్పిటల్ కి తరలించారు. రాకేష్ , జయంతి అనే వాళ్ళు , దుబాయ్ లోని ఒక స్పా లో పనిచేసేవాళ్ళు.. రాకేష్ ది , కేరళ , జయంతిది తమిళనాడు. జయంతికి పెళ్ళై , భర్తతో విడాకులు తీసుకొని ఉంటుంది. దుబాయిలో ఉండగా , రాకేష్ , జయంతి సహజీవనం చేశారు. తిరిగి ఎవరి రాష్ట్రాలకు వాళ్ళు వచ్చేసారు. కేరళలో రాకేష్ , వేరే అమ్మాయిని మూడు నెలలక్రితం పెళ్లిచేసుకున్నాడు.

  ఈ విషయం తెలిసి , జయంతి రాకేష్ ను , నిలదీసింది. రాకేష్ , తాను కోయంబత్తూర్ వస్తానని , అక్కడ ఒక అపార్ట్మెంట్ లో కలుద్దామని సమాచారం పంపాడు. రాకేష్ ని కలిసేందుకు వెళ్లిన , జయంతి , ముందుగా , హ్యాండ్ బ్యాగ్ లో , యాసిడ్ , కత్తి , విషం తీసుకొని పోయింది. అపార్ట్మెంట్ లోకి పోవడంతోనే , రాకేష్ పై యాసిడ్ పోసి , కత్తితో పొడిచి , తనుకూడా విషం తాగింది.. రాకేష్ ఐ రెండు కళ్ళు పోయాయి. పోలీసులు ఇద్దరినీ హాస్పిటల్లో చేర్చి కేసు దర్యాప్తు చేస్తున్నారు..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.