చేపలు కొంటే , ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ..

  0
  47

  తమిళనాడులో ఆఫర్లు తమాషాగా ఉంటాయి .. ఇప్పుడు మరో ఆఫర్ అందరి దృష్టినీ ఆకట్టుకుంది.. చేపలు కొంటే , ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ అంటూ బోర్డుపెట్టడంతో జనం ఎగబడ్డారు.. చేపలేకాదు , రొయ్యలు , పీతలు ఇలా సీ ఫుడ్ ఏదైనా , 500 రూపాయలకి కొంటే , లీటర్ పెట్రోల్ కూపన్ ఇస్తారు. మధురైలో ఫిష్ చైన్ మార్కెట్ సంస్థ పీఎస్ ఏ ఈ ఆఫర్ పెట్టింది. దీంతో లీటర్ పెట్రోల్ ఖర్చుచేసుకొని , ఈ షాపుకొచ్చి , చేపలు కొని , లీటర్ పెట్రోల్ కూపన్ తీసుకుపోతున్నారు. 40 కిలోమీటర్ల దూరంనుంచికూడా , లీటర్ పెట్రోల్ కూపన్ కోసం వచ్చి , 500 రూపాయలకి చేపలు కొన్నవాళ్లున్నారు.. తమాషా ఏమిటంటే ఇలాంటివారు , రానూపోనూ ఒకటిన్నర లీటర్ పెట్రోల్ అవుతుంది.. ఉచిత కూపన్ అన్నతరువాత , దానికోసం తామెంత ఖర్చు పెడుతున్నామనే విషయం మర్చిపోతున్నారు.. అదీ సంగతి..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?