షుగర్ 1206 , 12 ఏళ్లకే బాలుడి జీవితం ఇలా..

  0
  78

  షుగర్ లెవల్స్ 200 దాటిందంటే చాలామంది గాభరా పడతారు, ఆస్పత్రికి పరుగులు పెడతారు. అలాంటిది ఓ 12 ఏళ్ల పిల్లవాడికి షుగర్ లెవల్స్ ఏకంగా 1206గా నమోదైంది. అసలీ స్థితిలో ఆ పిల్లవాడు బతికి ఉండటమే ఆశ్చర్యం. వైద్య శాస్త్రానికే పెను సవాల్ గా మారిన ఈ కేసు మధ్యప్రదేస్ లోని శివపురి జిల్లా ఖోడ్ గ్రామంలో వెలుగు చూసింది.

  12ఏళ్ల సందీప్ కి చిన్నప్పుడే షుగర్ వ్యాధి వచ్చింది. దానికి మందులు వాడుతూనే.. రోజువారీ పనులు చేసుకుంటుండేవాడు. అయితే ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్ చెక్ చేయించకపోతుండటంతో సందీప్ కి క్రమంగా షుగర్ పెరుగుతూ వచ్చింది. దీంతో అతనికి ఆకలి కూడా పెరిగిది. అలా రోజుకి 45చపాతీలు ఈజీగా లాగించేవాడు సందీప్. అయినా తల్లిదండ్రులకు అనుమానం రాలేదు, సందీప్ ని ఆస్పత్రికి తీసుకెళ్లలేదు.

  అయితే సందీప్ కి క్రమంగా చూపు మసకబారింది. ఎడమ కన్ను పూర్తిగా కనపడటంలేదని చెప్పడంతో హడావిడి పడ్డ తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్ష చేసి డయాబెటిక్ రెటినోపతి అని చెప్పారు. అప్పుడు షుగర్ లెవల్స్ చూడగా ఏకంగా 1206గా నమోదైంది. దీంతో డాక్టర్లే ఆశ్చర్యపోయారు. అసలిలాంటి రీడింగ్ ఎవరికీ ఉండదని, షుగర్ అంతున్నా సందీప్ బతికున్నాడంటే ఆశ్చర్యమేనని చెబుతున్నారు వైద్యులు. ఇన్సులిన్ ఇచ్చి ముందు అతడి షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసి, కంటిచూపు తెప్పించేందుకు వైద్యం చేస్తున్నారు.

   

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?