175 ఎకరాల ఆసామి-ఇప్పుడు కూలీ..

    0
    484

    ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయనే సామెతకు ఓ సజీవ నిదర్శనం బ్రిజేష్ సుందర్ బిసాయ్. బిసాయ్ ఒకప్పుడు జమిందారు. 175 ఎకరాల ఆసామి. అడిగిన వారికి కాదనకుండా దాన ధర్మాలు చేసే జమిందారు. ఓ పెద్ద భవంతిలో పరిచారకులతో గడచిపోయిన జీవితం, ఇప్పుడు గత స్మృతిగానే మిగిలింది. బిసాయ్ ఇప్పుడు పొట్ట కూటికోసం కూలీగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య కూడా కూలి పనులకు వెళ్తోంది. ఒడిశాలోని నవరంగ్ పూర్ జిల్లా ఫతా గూడ గ్రామం ఒకప్పుడు బిసాయ్ ఏలిన గ్రామం. చుట్టు పక్కల గ్రామాలన్నీ ఆయన కనుసన్నల్లోనే ఉండేవి.

    ఇంద్రావతి ప్రాజెక్ట్ కోసం అప్పట్లో ప్రభుత్వం భూములు తీసుకుంది. ఆయన భూములు కూడా తీసుకుని నష్టపరిహారం ఇవ్వడంలో సరైన పద్ధతులు పాటించకపోవడంతో బిసాయ్ జీవితం తారుమారైంది. మొత్తమ్మీద 2.5కోట్లు రావాల్సిన నష్టపరిహారం 2 లక్షల రూపాయలకు మించలేదు. అది కూడా రెండేళ్లలో ఖర్చయిపోయింది. దీంతో పొలాలు లేక, బతికే దారి లేక అప్పటి వరకు ఇంట్లో ఉన్న వస్తువుల్ని అమ్ముకుంటూ వచ్చాడు. చివరకు ఇల్లు కూడా అమ్ముకుని జీవనం సాగించేందుకు భార్యా భర్తలిద్దరూ కూలీలుగా మారారు. ఇప్పటికీ 70ఏళ్ల వయసులో బిసాయ్ కూలీ పనులకు పోతుండగా, ఆయన భార్య కూడా కూలీగానే గడుపుతోంది. జీవితంలో వెలుగు నీడలు ఉంటాయనడానికి బిసాయ్ జీవితమే ఓ నిదర్శనం..

    ఇవీ చదవండి:

    అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

    ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

    ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?