ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు మాజీ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గత రాత్రి తన తల్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారని , కూతురు రిషిత చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు నేరుగా సుచరిత తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించింది. కొత్త మంత్రివర్గంలో స్తానం లేనందుకు నిన్నటి నుంచి ఆమె కోపంతో ఉన్నారు. ఆమె అనుచరులు , ఆమె ఇంటివద్ద గొడవ చేశారు. ఆమెతో మాట్లాడేందుకు , ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఇంటికి పోయి సర్దుబాటుకు ప్రయత్నం చేసినా , ఆ తరువాత కూడా ఆమె ఒప్పుకోలేదు.
ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పై , ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని తెలిసింది. ఆమె అనుచరులు కూడా , సజ్జలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రోజు ఇంటిలో పెట్టిన కార్యకర్తల సమావేశంలో , తన రాజీనామా నిర్ణయాన్ని ఆమె ప్రకటించారు. పార్టీలో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశారు. వైకాపాలో ఇతర క్యాడర్ ఎవరూ రాజీనామాలు చేయవద్దని . పార్టీకి నష్టం చేయవద్దని ఆమె సూచించారు. పదవిపోయిన తరువాత బాలినేని వాసు ఇంటికి పోయి , బతిమాలిన సజ్జల , రెడ్డి వర్గంకాదు కాబట్టి , ఇంత నిర్లక్ష్యం చేస్తారా అని నిలదీశారు..