సాదా దోశ, ఉల్లి దోశ, మసాలా దోశ, నెయ్యి దోశ, రవ్వ దోశ, కారం దోశ, పన్నీర్ దోశ… ఇలా రకరకాల దోశలు గురించి విన్నాం… చూశాం.. తిన్నాం. కానీ ఫైర్ దోశ గురించి ఎప్పుడైనా విన్నారా ? ఎన్నడైనా తిన్నారా ? అది ఎలా ఉంటుందో తెలుసా ? ఎలా చేస్తారో తెలుసా ? తెలియాలంటే ఇండోర్ కి వెళ్ళాల్సిందే. ఎందుకంటే అక్కడే ఫైర్ దోశను ఓ వంట మాస్టర్ తయారుచేస్తూ… దోశ ప్రియుల మనసులు గెలుచుకున్నాడు.
సాధారణంగా మంట పెట్టి, పెనం పెట్టి, పిండి వేసి, నూనె వేసి… దోరగా కాగిన తర్వాత వేడివేడి దోశ రెడీ అవుతుంది. ఇది మనందరికీ తెలిసిందే. కానీ ఇతను మాత్రం కానీ ఇది మాత్రం కాస్త స్పెషల్. ఇప్పుడు చెప్పినవన్నీ చేసిన తర్వాత, దోశకు కూడా మంట పెట్టడమే ప్రత్యేకత. ఆ కాలే దోశపై ఛీజ్, బటర్, చిల్లీ పౌడర్, శాస్, గరమ్ మసాలా, కూరగాయల ముక్కలు, ఉల్లిపాయ, క్యాప్సికమ్, ఉప్పు, కొత్తిమీర వేసేస్తాడు, ఆ తర్వాత అవన్నీ కలిపి దోసె దోరగా వేయించి చిన్న చిన్న ముక్కలుగా చేసి సర్వ్ చేస్తాడు. దోశ ఎలా ఉంటుందంటారా ? అదిరిపోయే టేస్ట్ అని అక్కడి దోశ ప్రియులు చెబుతుంటారు. ఓ ఫుడ్ బ్లాగర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఫైర్ దోశ వైరల్ అయింది.
View this post on Instagram
ఇవీ చదవండి..
ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?
అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?