పేరుకి ఫ్యాషన్ డిజైనర్.. ఇంట్లో బ్రోతల్ వ్యాపారం..

    0
    7948

    పేరుకి ఆమె ఫ్యాషన్ డిజైనర్, కానీ ఇంట్లో చేసేది మాత్రం బ్రోతల్ పనులు. అమ్మాయిలను తీసుకు రావడం, విటులను కూడా ఇంటికే తెప్పించి వ్యభిచారం నిర్వహించడం, వారి వద్ద డబ్బులు వసూలు చేసి తన కమీషన్ తీసుకోవడం. ఇదీ ఆమె చేస్తున్న పని. అప్పటి వరకూ ఇరుగు పొరుగువారు ఆమె నిజంగా ఫ్యాషన్ డిజైనర్ అనుకునేవారు. పోలీసులు వచ్చి విటుల్ని, అమ్మాయిల్ని పట్టుకుని తీసుకెళ్లడంతో అవాక్కయ్యారు. హైదరాబాద్ కుషాయిగూడ వాసవీ శివనగర్‌ పార్కు సమీపంలో ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్న సునీతా మండల్‌ (40) అనే మహిళ ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేస్తూ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. విషయం తెలిసిన కుషాయిగూడ, మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపారు. అదే ఇంట్లో ఇటీవలే అద్దెకు దిగిన బిల్‌ కలెక్టర్‌ వావనగారి మహాదేవ్, ఓ యువతితో కలిసి బెడ్‌రూంలో ఉండగా రెండ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిర్వాహకురాలు సునీతా మండల్, విటుడు మహదేవ్‌తో పాటుగా వ్యభిచారానికి పాల్పడుతున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, రెండు సెల్‌ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.