ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇగోలను పక్కనపెట్టి వారు కలసి నటిస్తున్నారు. కానీ అభిమానులు మాత్రం ఫ్యాన్ వార్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రామ్ చరణ్ ఫ్యాన్స్ రెచ్చగొడుతుంటే.. చరణ్ ఫ్యాన్స్ ని తారక్ ఫ్యాన్స్ టీజ్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. సినిమాపై ఈ ప్రభావం పడుతుందేమోనని మధ్యలో దర్శకుడు రాజమౌళి టెన్షన్ పడుతున్నారు.
మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఓ కొత్త పోస్టర్ విడుదల చేసించి ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక రికార్డు రేటుకి ‘ఆర్ఆర్ఆర్’ శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఏకంగా 325 కోట్లకు జీ5 డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ ‘ఆర్ఆర్ఆర్’ రైట్స్ సొంతం చేసుకుంది. దీంతో ఆ క్రెడిట్ తమ హీరోదేనంటూ ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది.
#FanBaselessRamCharan, #FanBaselessNTR అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. హీరోలిద్దరూ ఎంత మంచి స్నేహితులైనా.. అభిమానులు మాత్రం ఇలా వారికోసం కొట్టుకుంటున్నారు.
Who Has More Fan Base In South India???#KomaramBheemNTR #NTR #SeethaRAMaRajuCHARAN #FanBaseLessRamCharan #RangelessRamCheddy #FanBaseLessNTR
Like ❤ retweet ♻ pic.twitter.com/oEGdBDVjb0
— thala?abishek (@abishek002) May 21, 2021