11 రోజులపాటు నవ్వితే , ఇక జైలుకే..

  0
  331

  మరో 11 రోజులపాటు ఆ దేశంలో ఎవరూ నవ్వకూడదు.. బర్త్ డేలు , పెళ్లిళ్లు చేసుకోకూడదు.. పార్టీలు నిషిద్ధం.. ఇలాంటివి ఒక వేళ చేసుకున్నా జైల్లోపెడతారు .. ఇదీ ఉత్తరకొరియా దేశంలో ఇప్పుడున్న ఆంక్షలు , ఇవేకాదు వస్తువులు కొనేందుకు మార్కెట్ కు కూడా పోకూడదు. ఈ నెల 17 వ తేదీ , అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ 2 పదో వర్థంతి. ఈ సందర్భంగా దేశంలో 11 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. ఆంక్షలు ఉల్లంఘించే వారికోసం ప్రత్యేక పోలీసు దళాలు ఎప్పుడూ పహారా కాస్తుంటాయి.

  రాత్రి 7 తర్వాత ఏ ఇంటిలోనూ లైట్లు వెలగకూడదు. ఒక వేళ ఎవరైనా చనిపోతే , ఇంట్లో పెద్దగా ఏడుపులు వినిపించకూడదు. 17 వ తేదీన వారికి అంత్యక్రియలు కూడా జరపకూడదు. ప్రజలంతా దివంగత నేత కిమ్ జోంగ్ 2 స్మరణలోనే ఉండాలి. మద్యం కూడా 11 రోజులు నిషిద్ధం. గతంలో కూడా ఇలాంటి ఆంక్షలు ఉల్లంఘించిన సమయంలో అరెస్ట్ అయినా వారు ఇంతవరకు కనిపించలేదు. సంతాప దినాల సమయంలో ఆంక్షలు ఉల్లంఘిస్తే , దాని సిద్ధాంత ధిక్కారం కింద పరిగణిస్తారు.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.