మంత్రం చదవడం రాక, పెళ్లికొడుకు దొరికిపోయాడు..

  0
  2198

  సోషల్ మీడియా ప్రేమలు ఎంత అనర్థానికి దారి తీస్తాయో తెలిపే సంఘటన ఇది. ఫేస్ బుక్ వేదికగా ప్రేమించుకున్న ఇద్దరు యువతీ యువకులు పెళ్లి సమయంలో మంత్రాలు చదివే సమయంలో చిక్కిపోయి, పెళ్లి కొడుకు దెబ్బలు తిన్నాడు. ఉత్తర ప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ లో అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ ఫేస్ బుక్ ద్వారా లవ్ లో పడ్డారు. ఆ తర్వాత ఒకరినొకరు కలుసుకున్నారు, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు.

  అమ్మాయి ముస్లిం, అబ్బాయి హిందువు. అయితే తాను హిందువునన్న విషయాన్ని అబ్బాయి చెప్పలేదు. అమ్మాయిని పెళ్లాడాలన్న ఉద్దేశంతో తన పేరు మార్చుకున్నాడు. అమ్మాయికి మాత్రం అబ్బాయి విషయమంతా తెలుసు. పెళ్లి ముస్లిం సంప్రదాయం ప్రకారం చేసుకోవాలని పెళ్లి కూతురు తల్లిదండ్రులు కోరడంతో అబ్బాయి సరేనన్నాడు. అయితే పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు చేత మౌల్వీ చదివించే మంత్రాలు అతను చెప్పలేక తప్పుగా చదవడంతో అనుమానం వచ్చింది. దీంతో అబ్బాయి పాన్ కార్డ్, ఆధార్ కార్డు తీసుకుని పరిశీలించగా పూర్తి వివరాలు తెలిసిపోయాయి. దీంతో పెళ్లి కొడుకుని, వారి బంధువుల్ని కొట్టి తరిమేశారు. అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి నిర్బంధించారు. పోలీసులు ఇరు కుటుంబాలతో చర్చలు జరుపుతున్నారు.

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..