సుచరితకు, జగన్ , నో అపాయింట్మెంట్ , కారణమిదేనా ..?

  0
  2597

  మంత్రివర్గ విస్తరణలో తలెత్తిన ,అలకలు , అసంతృప్తులు , మూతి విరుపులు తగ్గిపోతున్నాయి . అసమ్మతివాదులు ముగ్గురు సర్దుకున్నా , మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత విషయంలో మాత్రం ముఖ్యమంత్రి జగన్ గట్టి పట్టుదలతోనే ఉన్నట్టున్నారు. తనకు మంత్రి పదవి రాలేదన్న కారణంతో ,మేకతోటి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు ఆమె ఇంటి ముందు హడావుడి ,నినాదాలు, గందరగోళం మధ్య ఆమె కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు . ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ వైయస్సార్సీపి కార్యకర్తగా కొనసాగుతానని చెప్పారు.

  అయితే మంత్రి పదవి రాలేదని అలిగి , గందరగోళం సృష్టించిన ,మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డిలను ముఖ్యమంత్రి మధ్యవర్తుల ద్వారా పిలిపించుకుని వారితో అన్ని వివరంగా మాట్లాడి , చెప్పవలసిన విధానంలో చెప్పి పంపించేశారు. వీళ్లంతా ముఖ్యమంత్రి మాటకి కట్టుబడి ఉంటామని ,కొన్ని సామాజిక సమీకరణాల దృష్ట్యా తమకు మంత్రి పదవి లభించలేదని , పార్టీ పటిష్టత , జగన్ ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే దిశగా తమ ప్రయత్నాలు ఉంటాయని చెప్పి , సర్దుకున్నారు.

  అయితే ఈ దశలో సుచరితకు మాత్రం జగన్ ఇంటర్వ్యూ దొరకలేదు . ఆమెను కలిసేందుకు ముఖ్యమంత్రి ఇష్టపడడం లేదని తెలిసింది. దీనికి కారణం మొదట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డి పోయిన సందర్భంగా సుచరిత కూతురు చేసిన వ్యాఖ్యానాలు తీవ్రంగానే ఉన్నాయి . రెడ్డి సామాజిక వర్గం కాబట్టి ముఖ్యమంత్రి ప్రత్యేక దూతలను శ్రీనివాసరెడ్డి ఇంటికి పంపించారు , మమ్మల్ని పట్టించుకోలేదు అని ఆరోపణలు చేశారు . రెడ్లకు ఒక రకంగా దళితులకు ఒక రకమైన న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు . ఇది ఇప్పుడు సంచలన విషయం అయింది .

  రాజకీయాల్లోఆమెను ఉన్నత స్థానానికి తీసుకు వెళ్ళిన జగన్ ని , ఆమె కృతజ్ఞతలు లేకుండా ఇలా మాట్లాడారు అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి . దీనికి తోడు ఆమె నేరుగా సజ్జల రామకృష్ణా రెడ్డి పై విమర్శలు చేశారు . ఇది కూడా ముఖ్యమంత్రి సీరియస్ గానే తీసుకున్నారని తెలుస్తోంది . ఈ విషయంలో మాత్రం ఆమెతో మాట్లాడకుండా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకే అసమ్మతివాదులను నేరుగా ఆయనే బుజ్జగించినా , ఆమె విషయంలో మాత్రం కఠినంగానే ఉన్నారు. రాజీనామా వెనక్కితీసుకోమని కోరే ఆలోచనకూడా లేదని తెలుస్తోంది..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..