నిశ్చితార్ధం తర్వాత ఇద్దరికీ ప్రాణగండం అయినా ..

  0
  101

  విధి బలీయమైనదే కాదు, చాలా క్రూరమైనది కూడా.. కొన్ని సంఘటనలు వింటే భరించడం కష్టం, అటువంటిదే ఈ దారుణం. ఇద్దరు ప్రేమికులు కిసెంక్ , మరియా నిలెసన్ పదేళ్లపాటు ఒకరిని ఒకరు, ఒకరి కోసం మరొకరుగా బ్రతికారు. హైస్కూల్ స్థాయి నుంచి ఇద్దరు స్నేహితులు గా ఉండి కాలేజీ జీవితంలో ప్రేమికులై , ఇద్దరు వివాహబంధంతో ఒకటి కావాలని నిర్ణయించుకున్నారు . వాళ్ల నిర్ణయానికి పెద్దలు కూడా ఒప్పుకున్నారు . ఎంగేజ్మెంట్ కూడా అయింది .

  ఇద్దరి మధ్య స్నేహం ప్రేమ ఫలించి పెళ్లితో సంపూర్ణం కావాలని , డిసెంబర్ నెలలో ఎంగేజ్ మెంట్ జరిగింది. జూన్ నెలలో పెళ్లి జరగాల్సిఉంది.. ప్రేమికులిద్దరూ ఈ సంతోషంతో ఉండగా ఒక పిడుగు లాంటి వార్త వారిని కుంగదీసింది. అదేమిటంటే పెళ్లి కూతురుకి క్యాన్సర్ ఉందని డాక్టర్లు చెప్పారు .. ఆమెను తీసుకొని ట్రీట్ మెంట్ కోసం పోతున్నప్పుడు నిలెసన్ కి మరో దారుణం తెలిసింది.

  జ్వరంతో బాధపడుతున్న నిలెసన్ పరీక్షలు చేయించుకోగా , బ్లెడ్ క్యాన్సర్ అని తేల్చారు. ఎంగేజ్ మెంట్ అయిన ప్రేమికులిద్దరికీ క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉంది.. ఏడాదికంటే ఎక్కువ బతికే అవకాశం లేదు.. దీంతో జూన్ లో జరగాల్సిన పెళ్లిని వచ్చేనెలలోనే చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. భార్యాభర్తలుగానే చనిపోవాలని నిర్ణయించుకున్నారు.. విధి ఎంత క్రూరమైనదో చూడండి..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..