బిఎండబ్యు కారుకి మెషీన్ గన్ .. ఇదీ దెబ్బంటే..

  0
  119

  దేశం చిన్నదే కావచ్చు, పేద దేశం కావచ్చు.. దేశ ప్రజలు ఆర్థికంగా బలహీనులే కావచ్చు , అయితే ఆ దేశ ప్రజల దేశభక్తి అనన్య సామాన్యం . ఇప్పటివరకు అదే ఆ దేశాన్ని బలమైన దేశం దాడుల నుంచి కాపాడుకుంటూ వస్తోంది . రష్యా ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్ధంలో ప్రజలు స్వచ్ఛందంగా వాలంటీర్లుగా మారి సైనికులకు తోడుగా యుద్ధంలో పాల్గొంటున్నారు .

  ఇప్పుడు సంచలనంగా మారిన విషయం ఏమిటంటే , ఓ వ్యక్తి తన బీఎండబ్ల్యూ కారుకి , మిషన్ గన్ అమర్చి మిలటరీ ,పోలీస్ , వాలంటీర్లకు పోరాడమని బహుమతిగా ఇచ్చాడు. అత్యంత విలువైన బీఎండబ్ల్యూ కారుని , ఫైటర్ కారుగా మార్చి బహుమతిగా మిలటరీకి ఇచ్చాడు. దీంతో రష్యాపై పోరాటానికి చాలామంది తమ కార్లను ఇలా మెషిన్ గన్ తో మార్పు చేసి సైన్యానికి ,వాలంటీర్లకు ,పోలీసులకు ఇస్తున్నారు . ఇదే ఇప్పుడు సంచలనమైన వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ న్యూస్.

  కార్లకు మిషన్ గన్ అమర్చి సైన్యానికి సహాయం చేయడమే కాదు, ఎక్కడికక్కడ స్థానికులు తమ కడుపు మాడ్చుకుని కూడా , తమ సైన్యానికి కడుపు నిండా భోజనం పెడుతున్నారు . యుద్ధకాలంలో రేషన్ బియ్యం కూరగాయలు లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ తమ బిడ్డలకు కూడా కూడు పెట్టలేని పరిస్థితి ఉన్నప్పటికీ , ముందు సైన్యం కడుపునింపుతున్నారు.

  తమ కోసమే తమ సైన్యం పోరాడుతుందని , తమ దేశం కోసం పోరాడుతోందని , తమ బిడ్డల కోసమే తమ సైన్యం పోరాడుతుందని అందువల్ల దేశ రక్షణ కోసం పోరాడుతున్న పోలీసులు సైనికులు వాలంటీర్లకు ఎక్కడికక్కడ కడుపునిండా భోజనం పెడుతున్నారు . అదీ తాము పస్తులుండి.. ఇది ఆ దేశ ప్రజల దేశభక్తి

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..