ఇటీవల కాలంలో పెళ్లయిన తర్వాత కొందరు భార్యలు , భర్తలకు ఇచ్చే షాపులు ఓల్టేజితో ఉంటున్నాయి , అటువంటిదే తమిళనాడులో కూడా జరిగింది .పెళ్లయి నెల రోజులు కాకముందే భార్య , భర్త కు షాక్ ఇచ్చింది. పాపం ఆ షాక్ నుంచి తేరుకునేలోపే అప్పటికి భర్త కి అసలు విషయం తెలిసి నెత్తీ నోరు బాదుకున్నాడు. .
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా వేంగికాలి గ్రామంలో ఒక నెల రోజుల క్రితం యశోద కి , తిరు అనే యువకుడితో పెళ్లయింది. అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. పెళ్ళైనప్పటినుంచి దిగులుగా ఉన్న భార్యను భర్త సముదాయించే ప్రయత్నం చేశాడు భర్త . అత్తగారింట్లో కూడా ఆమెకు అన్ని రకాల మర్యాదలు జరుగుతూనే ఉన్నాయి, అమ్మగారి ఇంటి నుంచి అత్తగారి ఇంటికి వచ్చిన దిగులు దిగులు తో ఉందికదా అని పాపం ఆ భర్త సినిమాలకి షికార్లకి తీసుకెళ్ళాడు, నెల రోజుల తర్వాత సడెన్ గా భార్య కనిపించలేదు. గుడికి పోయివస్తానని చెప్పి ఇంటికి తిరిగిరాలేదు.
ఆందోళనతో వెదుకులాట ప్రారంభించారు. అప్పుడే షాక్ లాంటి నిజం , భర్తకు తెలిసింది. ఇంటినుంచి వెళ్ళిపోయిన భార్య ఒక గుడిలో ప్రియుణ్ణి పెళ్లి చేసుకుని, ఆ తర్వాత తమకు రక్షణ కల్పించాలని పోలీసుల దగ్గరికెళ్లింది. అయితే పెళ్లి జరిగి నెలరోజులు కాకముందే భర్తను వదిలేసి రావడం మంచిది కాదని పోలీసులు నచ్చజెప్పారు,
అదికాక విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం కూడా నేరమని , అందువల్ల కోర్టుకు పొమ్మని , వెనక్కి పంపేశారు . పెద్దల మాట కాదనలేక తాను పెళ్లి చేసుకున్నానని ,అయితే ప్రతిరోజు ప్రియుడే కలలో కనిపిస్తున్నాడని , ప్రియుడిని వదిలి బతకలేనని , అతడుకూడా కూడా తనని వదిలి ఉండలేడని అందుకని ఇద్దరూ పారిపోయి వచ్చేసామని చెప్పింది.