ఇంటి గోడ‌ను బ‌ద్ద‌లు కొట్టుకుంటూ వంట‌గ‌దిలోకి..

  0
  426

  ఏనుగుకి ఆక‌లేస్తే… ఇంక చెప్పాలా ? దొరికింది లాగించేస్తుంది. ఎవ‌రొచ్చినా ల‌క్ష్య పెట్ట‌క ఆర‌గించేస్తుంది. ఇక పొలాల మీద ప‌డితే అంతే సంగ‌తులు. అయితే ద‌క్షిణ థాయ్ ల్యాండ్ లోని హువాహిన్ అనే ప్రాంతంలో ఓ ఏనుగు ఏకంగా వంట‌గ‌దిలోకి దూరేసింది. ప‌క్క‌నే ఉన్న అడ‌విలో నుంచి వ‌చ్చిన ఓ ఏనుగు.. రోడ్డుపై వెళుతోంది. ఇంత‌లో ఓ ఇంట్లో నుంచి ఘుమఘుమ‌లాడే వాస‌న వ‌చ్చింది. అంతే, ఏనుగుకి విప‌రీత‌మైన ఆక‌లి గుర్తొచ్చింది.

  ఆల‌స్యం చేయకుండా ఆ ఇంటివైపు ప‌రుగులు తీసింది. ఆ ఇంటి గోడ‌ను బ‌ద్ద‌లు కొట్టుకుంటూ వంట‌గ‌దిలోకి వెళ్ళిపోయింది. క‌నిపించిన ఆహార ప‌దార్ధాల‌ను ఎంచ‌క్కా లాగించేసింది. ఏనుగు చూసిన ఆ ఇంట్లో వాళ్ళు … ఏనుగును బ‌య‌ట‌కు పంపేందుకు నానా తంటాలు ప‌డ్డారు. ఎలాగోలా ఆ ఏనుగును మ‌ళ్ళీ అడ‌విలోకి త‌రిమేశారు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..