సంజ‌య్ ద‌త్ కు యూఏఈ గోల్డెన్ వీసా.

  0
  51

  బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్నారు. తమ దేశంలో లాంగ్ టర్మ్ ఉండే వారికి దుబాయ్ ప్ర‌భుత్వం ఈ వీసా అందజేస్తుంది. దీంతో విదేశీయులు యూఏఈలో ఉండవచ్చు, పని చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. బంగారు వీసా ఉన్నవారికి నేషనల్ స్పాన్సర్ అవసరం కూడా ఉండదు. 10 ఏళ్ల కాలానికి ఈ వీసాలు జారీ చేస్తారు. గడువు తీరగానే మళ్లీ రెన్యువల్ అవుతుంటాయి. గోల్డెన్ వీసా పొందిన తొలి భారత మెయిన్‌ స్ట్రీమ్ నటుడు సంజయ్ దత్ ఒక్కరే కావ‌డం విశేషం.


  దీనిపై సంజ‌య్ స్పందించారు. ఆ దేశ మేజర్ జనరల్ మొహమ్మద్ అల్ మారీ సమక్షంలో బంగారు వీసా గౌరవం దక్కిందని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు ఎంతో సంతోషంగా ఉందంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు సంజయ్. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..