కిరాతక క్రిమినల్ గ్యాంగ్ ని డాబాలో ఇలా ..

  0
  10043

  పోలీసులకు పట్టుబడకుండా తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్‌ని సినీ ఫ‌క్కీలో ప‌ట్టుకున్నారు అహ్మ‌దాబాద్ పోలీసులు. దేశ రాజ‌ధాని స‌హా ప‌లు రాష్ట్రాల్లో నిందితుడిపై చాలా కేసులు న‌మోద‌య్యాయి. మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఈ నిందితుడి పేరు ఉంది. చాలెంజింగ్ గా తీసుకున్న అహ్మ‌దాబాద్ అండ‌ర్ క‌వ‌ర్ పోలీసు బృందం మ‌ఫ్టీలో నిందితుడి కోసం వెదుకుతోంది.

  చివ‌రికి ఒక దాబాలో స‌హ‌చ‌రుల‌తో నిందితుడు ఉన్న‌ట్లు ఈ బృందం గుర్తించింది. అంతే సినీ ఫ‌క్కీలో అత‌న్ని చుట్టుముట్టి ప‌ట్టుకుంది. అచ్చం సినిమాలో సీన్ ని త‌ల‌పించేలా.. ఒక్కొక్క పోలీసు దాబాలోకి వ‌చ్చారు. నిందితుడు కూర్చున్న ప్ర‌దేశం చుట్టూ చేరిపోయారు. కుర్చీల్లో కూర్చుంటున్న‌ట్లు న‌టిస్తూ నేర‌స్తుడి చ‌ర్య‌ల‌ను గ‌మ‌నించారు. నిందితుడి వ‌ద్ద ఏమైనా ఆయుధాలు ఉన్నాయా లేవా అనే కోణంలోనూ ఆలోచిస్తూ తీక్ష‌ణంగా ప‌రిశీలించారు. అంతేకాదు ఆ క్రిమిన‌ల్ తో పాటు ఉన్న ముగ్గురిని కూడా పోలీసులు వాచ్ చేశారు. అద‌నుచూసి ఒక్క‌సారిగా నిందితుడిని చుట్టుముట్టి, రెండు చేతుల‌ను వెన‌క్కి విరిచి త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు.

  మిగిలిన ముగ్గురినీ రౌండ‌ప్ చేశారు. ఇక నిందితుడి జేబులో ఆయుధాలు ఉన్నాయ‌ని గుర్తించి, అత‌ని వ‌ద్ద‌ నుంచి పిస్టోలును తీసి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక అక్క‌డి నుంచి నెమ్మ‌దిగా బ‌య‌ట‌కి తీసుకొచ్చి జీబులో ఎక్కించి స్టేష‌న్ కి త‌ర‌లించారు. దాబాలో కూర్చున్న వారికి అక్క‌డ ఏం జ‌రుగుతుందో అర్ధ‌మ‌య్యేలోపు క్ష‌ణాల్లో క్రిమిన‌ల్ ని అరెస్టు చేసేశారు పోలీసులు. ఇదంతా డాబాలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ‌యింది. గ‌త‌నెల 27న ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.