బైక్ చోరీ చేసి చెరువులో వేసేస్తారు.. అంతే.

  0
  13739

  దొంగల్లో వీళ్లో రకం దొంగలు..బైకులు కొట్టేస్తారు.. తర్వాత ఆ బైకుల్లో పెట్రోల్ తీసుకుంటారు.. దాన్ని అమ్ముకొని బైక్ ని చెరువులో తోసేస్తారు. కేవలం పెట్రోల్ కోసమే బైకులు చోరీ చేస్తారు.. ఇంత కష్టపడి బైకులెందుకు చోరీ చేస్తున్నారో , అవి అమ్మకుండా కేవలం పెట్రోలు కోసమే ఎందుకీ సాహసం చేస్తున్నారో తెలుసా..? కేవలం గంజాయి కోసమే .. గంజాయికి అలవాటుపడ్డ వీళ్ళకి , దానికి సరిపడా డబ్బులొస్తే చాలంటున్నారు. అందుకే ఎక్కడో ఓ చోట బైక్ కొట్టేసి , పెట్రోల్ తీసేసి . లీటర్ పెట్రోల్ 50 రూపాయలకు అమ్మేసి , బైక్ మాత్రం చెరువులో వేసేస్తారు. పోలీసు నిఘావుంటే , వదిలేసి వెళ్ళిపోతారు. జైపూర్ లో ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎక్కువకావడంతో సిసి కెమెరాలు చూడటంతో ఈ విచిత్ర చోరీ బయటపడింది. ఇందుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకొని చెరువులో తోసేసిన బైక్ లు బయటకు తీస్తున్నారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.