ఫ్రిజ్ లో భర్త శవం – భార్యే సూత్రధారి..

  0
  1003

  హైదరాబాద్ లో ఫ్రిజ్ లో శవం మిస్టరీ వీడింది. తనకంటే చిన్నవాడైన ప్రియుడితో , భార్య భర్తను చంపించిందని తేలింది. హతుడు సాదిక్ టైలరింగ్ చేస్తుంటాడు. ఇద్దరు పిల్లలు. 35 ఏళ్ళ భార్య రుబీనా , తన తల్లి ఇంటిదగ్గరుండే 20 ఏళ్ళ యువకుడితో అక్రమసంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి భర్త మందలించడంతో గొడవలు జరుగుతున్నాయి. ప్రియుడితో ఉండేందుకు రుబీనా , భర్తను విడాకులు కోరింది. అయితే బిడ్డలకోసం సాదిక్ ఒప్పుకోలేదు. ఇకనైనా బుద్దిగా ఉండమని చెప్పాడు. ఈ పరిస్థితుల్లో రుబీనా తల్లి ఇంటికి పోయింది. ఐదు రోజులక్రితం , భర్తను తన పుట్టింటికి భోజనానికి పిలిచింది. రాత్రి 12 వరకు తన ఇంట్లోనే ఉంచుకొని పంపేసింది. తన భర్త తిరిగి వస్తున్నాడని ప్రియుడికి మెస్సేజ్ ఇచ్చింది. దీంతో ప్రియుడు , సాదిక్ ఇంటివద్ద కాపుకాసి , అతడు ఇంట్లోకి పోతూనే తానూ , ఇంట్లోకి జొరబడి సాదిక్ ను , చంపేశాడు. ఉదయం 4 వరకు ఇంట్లోనేఉండి , చివరకు శవాన్ని తరలించలేక , ఫ్రిజ్ లో పెట్టేసి , సాదిక్ బైక్ లోనే వెళ్ళిపోయాడు. పోలీసు విచారణలో మోసం బయటపడటంతో , రుబీనాను , ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

   

  ఇవీ చదవండి

  మందుబాబులు వాక్సిన్ వేసుకోవచ్చా..?

  మాస్క్ లేకపోతె మోకాళ్ళమీద నడిపిస్తారు.

  నౌకను చంద్రుడు కదిలించాడు..

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే..