చంపితే చంపుకో నేను చికెన్ తినడం మాత్రం ఆపనంటూ

  0
  26427

  చంపితే చంపుకో నేను చికెన్ తినడం మాత్రం ఆపనంటూ ఓ రెస్టారెంట్ లో కస్టమర్ చూపిన ధైర్యం మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. తన గర్ల్ ఫ్రెండ్ తో కలసి ఓ యువకుడు రెస్టారెంట్ లో భోజనం చేస్తున్నాడు. ఇంతలో తలకు హెల్మెట్ పెట్టుకుని రివాల్వర్ తో ఓ దొంగ లోపలికి ప్రవేశించాడు. తుపాకి చూపిస్తూ అందరి దగ్గర ఉన్న డబ్బులు తీసుకుంటున్నాడు. డబ్బులు లేకపోతే సెల్ ఫోన్లు లాగేసుకుంటున్నాడు. గర్ల్ ఫ్రెండ్ తో టేబుల్ దగ్గర కూర్చున్న అతని వద్దకు వచ్చాడు. చికెన్ తింటున్న అతను, రివార్వల్ చూసి కానీ, దొంగను చూసి కానీ ఏమాత్రం చలించలేదు. అదరకుండా, బెదరకుండా కూల్ గా చికెన్ తినేస్తున్నాడు. అడిగితే తన దగ్గరున్న వ్యాలెట్ అతనికి ఇచ్చేసి మళ్లీ కుల్ గా చికెన్ తినడం మొదలు పెట్టాడు. తాను రివాల్వర్ చూపించినా అంత కూల్ గా ఉన్న అతడ్ని చూసి దొంగ కూడా వెళ్లిపోయాడు. రెస్టారెంట్ లో దొంగ ఇంత హల్ చల్ చేస్తున్నా ఇతను మాత్రం చలించలేదు. శాండియాగో కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సీసీ కెమెరాల ద్వారా బయటకొచ్చింది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.