వామ్మో.. ఇది నోరా ..? సొరంగమా ..??

  0
  136

  ఎందుకురా నోరు అలా లావున తెరిచావు అంటూ పెద్దవాళ్లు ఎవరైనా కోప్పడే సందర్భాలు చాలానే చూసి ఉంటాం. అలా తెరిచినా ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఏమీ అనలేదు, పైగా ఇంకా ప్రోత్సహించారు, ఇంకా ఇంకా పెద్దగా తెరిచేలా ఉత్సాహ పరిచారు. అందుకే ఇప్పుడా పిల్లాడు గిన్నిస్ రికార్డు సృష్టించాడు. ప్రపంచంలోనే తానో ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఐజాక్ జాక్సన్..

  అతనిపేరు ఐజాక్ జాక్సన్. అమెరికా వాసి. ఏకంగా 10.175 సెంటీమీటర్లమేర నోరు తెరిచి గిన్నిస్ రికార్డు సాధించాడు. చేయి కానీ, ఇతర ఏ సాధనాలు కానీ ఉపయోగించడు. ఏ సహాయం లేకుండానే నోరు బార్లా తెరిచాడు. రికార్డు కొట్టేశాడు.

  గతంలో నోరు తెరవడంలో గిన్నిస్ రికార్డ్ బర్నార్డ్స్ స్కండిడ్ అనే జర్మనీ వ్యక్తి పేరుతో ఉండేది. ఆ తర్వాత దాన్ని ఫిలిప్ యాంగస్ అధిగమించాడు. ఏకంగా 9.52 సెంటీమీటర్లు తెరిచాడు. వీరిద్దర్నీ వెనక్కి నెట్టి ఐజాక్ జాన్సన్ 10.175 సెంటీమీటర్లతో రికార్డు సృష్టించాడు. ట్రైనింగ్ తీసుకుని మరీ ఈ ఫీట్ సాధించాడు ఐజాక్ జాన్సన్.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.