ఇటీవల కాలంలో పాఠశాల స్థాయి నుంచి అమ్మాయిల మధ్య ఫైటింగులు ఎక్కువయ్యాయి. కర్ణాటక, చెన్నై, ఇండోర్, లక్నో.. ఇలా చోట్ల అమ్మాయిలు గ్యాంగ్ వార్ లా మారి కొట్టుకుంటున్నారు. సినిమాల్లో రౌడీ మూకలను మించి అమ్మాయిల ఫైటింగులను చూస్తుంటే.. ఆశ్చర్యమేస్తోంది. దీనికి పరాకాష్టగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో నలుగురు అమ్మాయిలు డొమినోస్ పిజ్జా డెలివరీ అమ్మాయిని కర్రలతో చితక్కొట్టారు.
పబ్లిక్ గా జరిగిన ఈ దారుణాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది మరింత సంచలనమైంది. పిజ్జా డెలివరీ అమ్మాయిని కర్రలతో కొడుతూ.. జుట్టుపట్టి లాగుతూ దారుణంగా కొట్టారు. రోడ్డుపై అందరూ చూస్తున్నారే తప్ప, ఎవరూ ఆమెను రక్షించేందుకు ముందుకు రాలేదు. ఆ పిజ్జా డెలివరీ అమ్మాయి ఉద్యోగానికి వెళ్తుండగా.. అకారణంగా నలుగురు అమ్మాయిలు ఇలా దారుణంగా నడిరోడ్డుపై కొట్టారు.
#Viral | A woman, who seemed to be a Domino's Pizza employee, was brutally beaten up by a group of women in Madhya Pradesh's Indore, allegedly for staring at them.#Dominos pic.twitter.com/edc509pgNm
— News18.com (@news18dotcom) June 14, 2022