కరోనా తర్వాత ఎముకలు నొప్పులా?జాగ్రత్త .

    0
    492

    కరోనా ట్రీట్మెంట్ లో డాక్టర్ల లోపం వల్ల వచ్చే జబ్బులలో బ్లాక్ ఫంగస్ , వైట్ ఫంగస్ , ఎల్లో ఫంగస్ జబ్బులతోనే ప్రజలు భయపడిపోతుంటే , ఇప్పుడు మరో ప్రమాదకరమైన జబ్బు వెలుగులోకి వచ్చింది. దీని పేరు అవాస్కులర్ నెక్రోసిస్ .. అంటే ఎముకలు కణాలు మృతప్రాయం కావడం.. అంటే ఈ వ్యాధి వస్తే జాయింట్స్ దగ్గర ఎముక బలహీనమై సులభంగా విరిగిపోతుంది.. . కరోనా తర్వాత వచ్చే మ్యుక్రోమైకోసిస్ , అవాస్కులర్ నెక్రోసిస్ వ్యాధులకు ఒకే కారణం కనిపిస్తోంది..కరోనా ట్రీట్మెంట్ సమయంలో స్టెరాయిడ్స్ ను డాక్టర్లు విచ్చలవిడిగా ఉపయోగించడం.. ఇతరత్రా జబ్బులున్న వారికి కూడా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడేస్తున్నారు. దీనివల్ల శరీరం సహజ రోగ నిరోధక శక్తిని కోల్పోయి , ప్రమాదకరమైన రోగాలకు నిలయం అవుతోంది. ముంబైలోని ముగ్గురు యువకులు కరొననుంచి కోలుకున్న తరువాత రెండునెలలకు వాళ్లకు తీవ్ర అనారోగం వచ్చింది. మాహిమ్ లోని హిందూజా హాస్పిటల్లో వీళ్లను పరిశీలిస్తే వాళ్లకు ఎముకల్లోని కణజాలం మృతప్రాయం కావడం కనిపించింది. దీనివల్ల ఎముక కీళ్లు , నడుము , తొడ ఎముక లాంటి భాగాల్లో నొప్పిరావచ్చు. అలాంటి సమయంలో స్కానింగ్ ద్వారా వ్యాదినిర్దారణచేసి , తక్షణమే వైద్యం చెయ్యాలని హాస్పిటల్ డైరెక్టర్ అగర్వాల్ చెప్పారు..

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.