భార్యతో వేగలేక ఓ డాక్టర్ చివరి మాట..

  0
  4519

  భార్య వేధింపులు భ‌రించ‌లేని ఓ డాక్ట‌ర్ పాయిజ‌న్ ఇంజ‌క్ష‌న్ తీసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. సుసైడ్ కి ముందు ఆ డాక్ట‌ర్ రాసిన లేక భార్య క‌సాయి త‌నానికి, నీచ‌త్వానికి నిద‌ర్శ‌నం. ఆ భార్య చేతిలో ఎన్ని బాధ‌లు ప‌డ్డాడో వివ‌రిస్తూ, ఆమె కార‌ణంగా త‌ల్లిని కూడా ఎలా దూరం చేసుకున్నాడో చెప్పారు. గ్వాలియ‌ర్ కి చెందిన రైల్వే శాఖ‌లో ప‌ని ఏసే డాక్ట‌ర్ గౌర‌వ్ కుమార్ గుప్తా త‌న స్నేహితుడి క్లీనిక్ లో మూడు రోజుల క్రితం ఒక గ‌ది అద్దెకు తీసుకుని, ఆ గ‌దిలోనే పాయిజ‌న్ ఇంజెక్ష‌న్ తీసుకుని చ‌నిపోయాడు. చ‌నిపోతూ భార్య‌కు రాసిన లేఖ‌లో న‌న్ను క‌ష్టాలు పెట్ట‌వ‌ద్ద‌ని నిన్ను కాళ్ళు ప‌ట్టుకుని బ‌తిమిలాడాను. వ‌ర‌క‌ట్నం కేసులంటూ నాపై కేసులు పెట్టావు.

  నా డ‌బ్బంతా మీ కుటుంబం కోస‌మే ఖ‌ర్చు పెట్టావు. నువ్వు మీ వ‌దిన మీ అక్క‌, మీ తండ్రి అంద‌రూ క‌లిసి నామీద దాడి చేసి నేను వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు కేసు పెట్టారు. నీ వ‌ల్ల త‌ల్లికి కూడా దూర‌మ‌య్యాను. భార్య‌గా నీవు పెట్టే బాధ‌లు భ‌రించ‌లేక‌, త‌ప్పుడు కేసులు భ‌రించ‌లేక చివ‌రిసారిగా లేఖ రాసి చ‌నిపోయాడు. నాలుగు పేజీల ఈ సుసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు భార్య షైలీని, మామ మ‌హేంద‌ర్ లాల్‌, బావ‌మ‌రిది భార్య నేహాను అరెస్టు చేశారు. త‌న భార్య పెట్టే వేధింపులు ప్ర‌పంచంలో ఏ భ‌ర్త‌కు ఇలాంటి దుర‌వ‌స్త రాకూడ‌దంటూ ఆ లేఖ‌లో పేర్కొన్నాడు. ఉన్న డ‌బ్బంతా భార్య కుటుంబం కోసం ధార‌పోసినా వేధింపులు మాత్రం మాన‌లేద‌ని చెప్పాడు.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్