చిరంజీవి, పవన్ వ్యాఖ్యలపై తమిళనాడు అసెంబ్లీలో చర్చ

  0
  394

  తమిళనాడు అసెంబ్లీలో మెగా బ్రదర్స్ పేర్లు మారుమోగాయి. ఇటీవల పవన్ కల్యాణ్, తమిళనాడు సీఎం స్టాలిన్ ని పొగుడుతూ వేసిన ట్వీట్ పై డీఎంకే నేత ప్రస్తావన తెచ్చారు. స్టాలిన్ పాలనను పొరుగు రాష్ట్రాలు కూడా గుర్తించాయని చెప్పారు. చిరంజీవ కూడా ఇటీవల స్టాలిన్ ను కలసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.

  తమిళనాడు సీఎం స్టాలిన్‌ను అభినందిస్తూ ఇటీవల పవన్‌ కల్యాణ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ‘‘ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలి.. కానీ అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, ప్రభుత్వ పనితీరు మీ ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశంలోని రాష్ట్రాలకు, అన్ని పార్టీలకు మార్గదర్శకం.. స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని ట్వీట్‌లో పవన్‌ పేర్కొన్నారు.

  రెండ్రోజుల క్రితం చిరంజీవి.. స్టాలిన్‌తో భేటీ అయ్యారు. చెన్నైలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ‘స్టాలిన్‌ను కలవడం సంతోషంగా ఉంది. ఆయన తీసుకున్న పలు ఉన్నతమైన నిర్ణయాలతో గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదిగారు. కరోనా కాలంలో మెరుగైన పాలన అందిస్తున్నారని అభినందనలు తెలిపాను’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

  ఈ క్రమంలో చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి డీఎంకే నేతలు తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తావించారు.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్