ఆ డాక్టర్ వీర్యం మిస్టరీ వీడింది.

  0
  951

  పిల్ల‌లు పుట్ట‌డం లేద‌ని ఆ ఆస్ప‌త్రికి ట్రీట్మెంట్ కి వెళ్ళిన చాలామంది దంప‌తుల‌కు పుట్టిన బిడ్డ‌లు ట్రీట్మెంట్ చేసిన డాక్ట‌ర్ పోలిక‌లు ఉండ‌డంతో, పెద్ద గంద‌ర‌గోళం చెల‌రేగింది. సంతాన సాఫ‌ల్య కేంద్రం పెట్టుకుని బిడ్డ‌లు లేనివారికి సంతానం క‌లిగించే ఆ ఆస్ప‌త్రి వివాదాల్లో చిక్కుకుంది. దాదాపు 100 మంది దంప‌తుల‌కు పుట్టిన బిడ్డ‌లు ఆ డాక్ట‌ర్ పోలిక‌ల‌తో ఉన్నారు. దీంతో ఆ డాక్ట‌ర్ చేసిన మోసం బ‌య‌ట‌ప‌డింది. సంతాన సాఫ‌ల్యం కోసం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం వ‌చ్చే దంప‌తుల‌కు ఆ డాక్ట‌ర్, త‌న వీర్యాన్నే దానం చేసి బిడ్డ‌లు పుట్టిస్తున్నాడ‌ని తేలింది.

  కెన‌డాకి చెందిన నార్మ‌న్ బార్విన్ అనే డాక్ట‌ర్ పై గ‌త కొన్నేళ్ళుగా జ‌రుగుతున్న న్యాయ పోరాటం ఫ‌లించింది. ఆయ‌న‌పై 80 కోట్ల రూపాయ‌లు జ‌రిమానా విధించి, ఆయ‌న మెడిక‌ల్ లైసెన్సును కూడా ర‌ద్దు చేశారు. 2016లో డ‌వినా డిక్స‌న్ అనే వ్య‌క్తి ఈ డాక్ట‌ర్ పై దావా వేశారు. కృత్రిమ ప‌ద్ద‌తిలో త‌నకు పుట్టిన ఇద్ద‌రు బిడ్డ‌లు, తాను దానం చేసిన వీర్యంతో పుట్టారా లేక డాక్ట‌ర్ వీర్య దానంతో పుట్టారా తేల్చాల‌ని కోర్టును కోరాడు. కృత్రిమ గ‌ర్భ‌ధార‌ణ ద్వారా త‌న భార్య‌కు పుట్టిన ఇద్ద‌రు పిల్ల‌లు డాక్ట‌ర్ పోలిక‌లు ఉన్నాయ‌ని, కావున డాక్ట‌రుకు డీఎన్ఏ ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని కోర్టును కోరాడు.

  డీఎన్ఏ టెస్టులో డాక్ట‌ర్ ది , ఆ పిల్ల‌ల‌ది ఒక‌టే కావ‌డంతో అత‌ని నేరం రుజువైంది. అలాగే మిగిలిన పిల్ల‌ల‌కు కూడా డాక్ట‌ర్ వీర్యం ద్వారానే పిల్ల‌లు పుట్టార‌ని కోర్టులో నిర్ధార‌ణ అయింది. దీంతో గ‌త 35 ఏళ్ళుగా ఆ డాక్ట‌ర్ వ‌ద్ద సంతానం కోసం ట్రీట్మెంట్ తీసుకుని సంతానం పొందిన చాలామంది ఆయ‌న‌పై కేసు వేస్తున్నారు. డీఎన్ఏ టెస్టుల కోసం ప‌ట్టుబ‌డుతున్నారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?