కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన ఓ అమ్మాయి ఢిల్లీలో దిశా యాప్ సాయంతో కీచకుల బారిన పడకుండా రక్షించుకుంది. విజయవాడ నుంచి రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఒక ఉద్యోగం కోసం ఢిల్లీ వెళ్ళింది. ట్రైన్లో ఒక జంట పరిచయమైంది. ఢిల్లీలో తన స్నేహితురాలు ఉందని పోరుమామిళ్ల యువతి చెప్పింది. తనకు ఎక్కడ దిగాలో , ఆటో ఎలా మాట్లాడుకోవాలో సాయం చేసిపెట్టమని అడిగింది. దీంతో ఆ జంట ట్రైన్ లోనుంచే ఫోన్ చేసి ఆటో ఏర్పాటు చేశారు. అయితే దారిలో అడ్రెస్స్ కోసం ఆ యువతి తన ఫ్రెండ్ నంబర్ ఇచ్చి , ఫోన్ చేసి డ్రైవర్ కి ఇచ్చింది. డ్రైవర్ మాట్లాడిన తీరు అనుమానాస్పదంగా ఉండటంతో , ఆ యువతి ఆటో దిగేస్తానని గొడవచేసింది. చివరకు ఆటో దిగేసి , మళ్ళీ రైల్వే స్టేషన్ కి వెళ్ళింది. స్టేషన్ నుంచే దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకుంది. దిశా యాప్ నుంచి చేసిన కాల్ కి కడప ఎస్పీ నేరుగా అందుబాటులోకి వచ్చారు. విషయం తెలుసుకున్న ఆయన వెంటనే ఢిల్లీలోని స్వచ్ఛంద సంస్థకు ఫోన్ చేసి చెప్పారు. తరువాత డిఎస్పీ రవికుమార్ కి అప్పజెప్పారు. అమ్మాయిని మిషన్ ముక్తి ఫౌండేషన్ ద్వారా ఢిల్లీ పోలీసులు సంప్రదించారు. ఆమెను పోవాల్సిన చోట్లకు తీసుకెళ్లి , మళ్ళీ ఢిల్లీలో స్వర్ణజయంతి ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కించి విజయవాడకు పంపారు.. సో ..అమ్మాయిలూ దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకోండి..
ఇవీ చదవండి..
మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.
25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .
తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..
పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్