ఏడో తేదీన మంత్రుల రాజీనామాలు..?

  0
  257

  ఈ నెల 7 వతేదీన మంత్రులందరూ తమ రాజీనామాలను సమర్పిస్తారని తెలుస్తోంది.. 7 వతేదీన మంత్రివర్గ సమావేశంలో , సీఎం జగన్ , మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణపై మంత్రులకు చెపుతారని , కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు వీలుగా , మంత్రులంతా రాజీనామా సమర్పిస్తారని తెలిసింది.

  ఈ నెల 8వ తేదీన సీఎం జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందను తో అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆరోజునే మంత్రివర్గ సభ్యుల రాజీనామాలను గవర్నర్ కు సమర్పిస్తారని చెబుతున్నారు. ఈనెల 11 నాటికి సీఎం జగన్ కొత్త మంత్రివర్గం ఏర్పాటుకానుంది.

  రాజీనామాలు సమర్పించేందుకు మంత్రులు అందరూ సిద్దంగానే ఉన్నారు. ప్రస్తుత మంత్రివర్గం ఏర్పాటుకు ముందే రెండున్నరేళ్లు మాత్రమే మీరు మంత్రులని సీఎం జగన్వైఎసార్సీపి లెజిస్లేచర్ సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే..

  ఏడో తేదీ ఎంతమంది మాజీలు అవుతారు.. అందరూ మాజీలా , లేకపోతే కొందరా..? అన్న ప్రశ్నకు , అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పిస్తారని చెబుతున్నారు. మాజీలయ్యే మంత్రులకు అప్పగించబోయే పార్టీబాధ్యతలను కూడా , కొత్తమంత్రివర్గం తరువాత చెపుతారని భావిస్తున్నారు..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.