నిమిషాల్లో గమ్యం చేరుకునేలోగా.,మంటల్లో..

  0
  6853

  మధ్యాహ్నం 12-30 గంటలు , ఆకాశంలో పెద్దపేలుడు.. అగ్ని గోళం .. చూస్తే హెలికాఫ్టర్ అగ్నికీలల్లో గిరికీలు .. పైనే ముగ్గురు వ్యక్తులు హెలికాఫ్టర్ లోనుంచి కింద పడ్డారు.. చూస్తుండగానే అది నేరుగా గ్రామంలోని ఒక పార్క్ సమీపంలో పెద్ద చెట్టును ఢీకొని , మంటల్లో మాడిపోయింది.. అంటూ కృష్ణస్వామి అనే ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. తన పక్కనేవున్న కుమార్ అనే యువకుడు , ఈ విషయాన్నీ పోలీసులకు , ఫైర్ సిబ్బందికి చెప్పాడన్నారు.. అంతలో గ్రామస్తులుకూడా వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారని తెలిపాడు..

  డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ , ఆయన భార్యతో సహా 14 మంది చనిపోయిన రక్షణ రంగ హెలికాఫ్టర్ ప్రమాదానికి కృష్ణస్వామి ప్రత్యక్ష సాక్షి. మెట్టుపాళ్యం – కూనూర్ ఘాట్ రోడ్డులో నంజప్పన్ చేత్తిరం అనే గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.. దురదృష్టం ఏమిటంటే , హెలికాఫ్టర్ దిగాల్సిన వెల్లింగ్టన్ హెలిపాడ్ , దుర్ఘటన జరిగిన ప్రాంతం చేరుకోవడానికి మరో 10 నిమిషాలే పడుతుంది. హెలికాఫ్టర్ వచ్చేస్తుందని అక్కడ సిబ్బందికి సూచనలు అందిన తరువాత , స్వాగతానికి అందరూ సిద్దమై ముందుకొచ్చి ఎదురుచూస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది…

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.