టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ హెయిర్ స్టైల్ కి ఒకప్పుడు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండేది. అప్పటి వరకూ షార్ట్ హెయిర్ తో కనిపించిన కుర్రకారు అంతా.. ధోనీ ఫామ్ లోకి వచ్చాక ఒక్కసారిగా గిరజాల జుట్టు పెంచేశారు. హెయిర్ స్ట్రైటెనింగ్ చేయించుకుని పొడుగు చుట్టుని సవరించుకుంటూ ధోనీని అనుకరించారు.
ఆ తర్వాత ధోనీకి వయసుపైబడటం, కోహ్లీ ఫామ్ లోకి రావడంతో.. చాలామంది కోహ్లీ హెయిర్ స్టైల్ ని ఫాలో అయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ ధోనీ రంగంలోకి దిగారు. కొత్త హెయిర్ స్టైల్ తో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ధోనీ న్యూ హెయిర్ స్టైల్ హాట్ టాపిక్ గా మారింది. హెయిర్ స్టైల్ మాత్రమే కాదు బియర్డ్ స్టైల్ కూడా అదిరిపోయింది. చాన్నాళ్ల తర్వాత మళ్లీ స్టైలింగ్ విషయంలో ధోనీ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అయ్యారు.
MS Dhoni sports new hairstyle, fans' opinions divided
Read @ANI Story | https://t.co/4mcOwreGsv#Dhoni #Cricket pic.twitter.com/S8sVOVmkfX
— ANI Digital (@ani_digital) July 30, 2021
ఇవీ చదవండి..
ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?
అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?