కరెంట్ కష్టాలు , పెళ్లి కూతుళ్లను మార్చేశాయి..

  0
  455

  కరెంట్ కష్టాలు , పెళ్లి కూతుళ్లను మార్చేశాయి.. నమ్మడంలేదా..? ఇది నిజమండీ బాబూ.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో జరిగింది. రమేష్ లాల్ అనే వ్యక్తి కూతుళ్లు నికిత , కరిష్మా.. వీళ్లిద్దరికీ డాంగ్వారాబోలా , గణేష్ అనే యువకులతో పెళ్లి కుదిరింది. ఇద్దరికీ , ఒకేమండపంలో , ఒకే ముహూర్తానికి పెళ్లి కుదిర్చారు. పెళ్ళిలో తాళికట్టే సమయానికి ముందే కరెంటు పోవడంతో , జంటలను , పీటలు చుట్టూ తిప్పి , పురోహితుడు తాళికట్టించాడు.

  కరెంట్ పోవడం , పీటలచుట్టూ ప్రదక్షిణలో అమ్మాయిలు మారిపోవడంతో , ఆచారం ప్రకారం అమ్మాయిలకు మేలిముసుగులు ఉండటం , అవికూడా ఒకే రకమైనవి కావడంతో , పెళ్లికూతుళ్ళు అటుఇటుగా మారిపోయారు. అక్కకు దక్కాల్సిన మొగుడు చెల్లికి , చెల్లికి దక్కాల్సిన మొగుడు అక్కకు దొరికాడు. అదే రోజు రాత్రి పెళ్లి కొడుకులు పెళ్లికూతుళ్ళను తీసుకెళ్లిపోయారు , వారి సంప్రదాయం ప్రకారం , పెళ్ళికొడుకు ఇంట్లో మేలిముసుగు తియ్యాలి.. ఇంకేముంది , ముసుగులో తీయగానే రెండు కుటుంబాల్లో కలకలం చెలరేగింది.. మళ్ళీ మరుసటి రోజు , గుడిలో తాళి తీసేసి , పెళ్లికూతుళ్ళను మార్చేసుకున్నారు..

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.