2 రూపాయల పాత నాణెం ఉందా.? మీరు లక్షాధికారి అయినట్టే.?

  0
  394

  పాత నాణేల సేకరణ కొంతమందికి హాబీ. అదే సమయంలో వారికి కొన్నిసార్లు ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతుంది. పాతవి, అరుదైన నాణేలను సేకరించేవారు ఆన్ లైన్ వేలంలో పాల్గొని తమ దగ్గర ఉన్న వాటిని అమ్ముకోవచ్చు. ఇటీవల ఇలా పాత 2 రూపాయల నాణెంకు అత్యథిక డిమాండ్ ఉన్నట్టు తేలింది.1994, 1995, 1997, 2000 సంవత్సరాలకు చెందిన 2 రూపాయల నాణెం ఉంటే లక్షాధికారి అయిపోవచ్చని అంటున్నారు. బెంగళూరుకు చెందిన క్విక్కర్‌ వెబ్‌ సైట్‌ లో చాలా మంది కొనుగోలుదారులు ఈ పాత, అరుదైన నాణానికి భారీ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.

  రూ. 10నోటుకి కూడా డిమాండ్.. 
  పాత ఫీచర్లతో ఉన్న రూ .10 నోటుని ఆన్‌ లైన్‌ లో కాయిన్‌ బజార్ ప్లాట్‌ ఫామ్‌ లో అమ్మవచ్చు. ఈ అరుదైన పాత నోట్లు, నాణేల కోసం కొనుగోలుదారులు వేల రూపాయలు చెల్లిస్తున్నట్లు వినికిడి. అయితే పది రూపాయల నోటులో ఒక వైపు అశోక స్తంభం, మరో వైపు పడవ ఉండాలి. ఈ నోటు 1943 సంవత్సరంలో జారీ చేసి ఉండాలి. అలా ఉంటే ఆ నోటుకి వేల రూపాయలు డిమాండ్ ఉన్నట్టే.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..