పోలీస్ ఇన్ స్పెక్టర్ భార్య.. ఇలా మోసపోయింది..

  0
  1450

  ఆన్ లైన్ లో చీర ఆర్డర్ ఇచ్చిన ఓ పోలీసాఫీసర్ భార్య ఏకంగా లక్షా 4వేల రూపాయలు మోసపోయింది. హైదరాబాద్ కి చెందిన ఓ పోలీసాఫీసర్ భార్య ఆన్ లైన్ లో చీర ఆర్డర్ ఇవ్వగా ఓ పార్సిల్ వచ్చింది. దాన్ని తెరచి చూస్తే అందులో చిత్తు కాగితాలున్నాయి. దీంతో కస్టమర్ కేర్ కి ఫోన్ చేసింది ఆమె. ప్యాకింగ్ చేసేటప్పుడు జరిగిన పొరపాటు వల్ల చీర రాలేదని, డబ్బులు రిటర్న్ చేస్తామని తెలిపారు సంస్థ సిబ్బంది. క్యూఆర్ కోడ్ పంపిస్తాం, స్కాన్ చేయాలని చెప్పారు.
  అక్కడే మొదలైంది అసలు కథ..
  క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డబ్బులు తిరిగి వస్తాయనుకున్న పోలీసాఫీసర్ భార్య ఫోన్ లో స్కాన్ చేసింది. అయితే డబ్బులు రావడానికి బదులు ఏకంగా ఆమె అకౌంట్ లోనుంచి 25వేల రూపాయలు డెబిట్ అయింది. ఆ తర్వాత మరోసారి 25వేలు, 9వేలు.. ఇలా వరుసగా డబ్బులు పోతూనే ఉన్నాయి. డబ్బులు వస్తాయి కదా అనుకున్న ఆమె.. ఇలా వరుసగా పోగొట్టుకుంటూ.. మొత్తంగా రూ.1.04 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. నిత్యం సైబర్ క్రైమ్ వివరాలు తెలుసుకుంటున్నా కూడా ఆమె ఇలా మోసపోవడం విచిత్రం. హైదరాబాద్ సైబర్ టీమ్ ఈ కేసు దర్యాప్తు చేస్తోంది.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..