మోడీగారూ ఇదేనా మీ పాలన?తిట్టిపోసిన హైకోర్టు.

    0
    961

    క‌రోనా రోగుల‌కు ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా చేయ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని ఢిల్లీ హైకోర్టు ఘాటైన ప‌ద‌జాలంతో నిర‌సించింది. ఆక్సీజ‌న్ లేక రోగులు చ‌చ్చిపోతుంటే చేతులు క‌ట్టుకుని కూర్చున్న అస‌మ‌ర్ధ ప్ర‌భుత్వం మీదంటూ మోడీ స‌ర్కార్ ని చెండాడింది. ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రాకు స‌రైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు.. ఏం చేస్తారో మాకు తెలియ‌దు… అడుక్కుతినండి.. అప్పు తెచ్చుకోండి… దొంగ‌త‌నం చేయండి.. ఆక్సీజ‌న్ మాత్రం స‌ర‌ఫ‌రా చేయండి అంటూ కోర్టు ప్ర‌భుత్వాన్ని త‌ప్పుబ‌ట్టింది. ప‌రిస్థితి ఇంత భ‌యాన‌కంగా ఉంటే కేంద్రం ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదంటూ నిల‌దీసింది.

    బాలాజీ మెడిక‌ల్ రీసెర్చ్ సెంట‌ర్ దాఖ‌లు చేసిన ఒక పిటీష‌న్ పై ఢిల్లీ ఉన్న‌త న్యాయ‌స్థానం అత్య‌వ‌స‌రంగా విచార‌ణ ప్రారంభించింది. ఆక్సీజ‌న్ లేక వంద‌లాది మంది రోగులు చ‌నిపోతున్నార‌ని, ఇది వేల‌సంఖ్య‌కు చేరినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌ని, ఇంత దారుణం జ‌రుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా అంటూ న్యాయ‌మూర్తులు విపిన్ సంఘ్వీ, రేఖా పాటిల్ నిల‌దీశారు. ప‌రిశ్ర‌మ‌ల‌కు ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా నిలిపివేసి, ఆస్ప‌త్రుల‌కు ఎందుకు త‌ర‌లించ‌ర‌ని… ప‌రిశ్ర‌మ‌ల మీద ఉండే ప్రేమ రోగుల ప‌ట్ల లేదా అంటూ ప్ర‌శ్నించారు. ప‌రిశ్ర‌మ‌ల‌కు ముఖ్యంగా స్టీల్, పెట్రోలియం సంస్థ‌ల‌కు నిలిపివేసి, ఆస్ప‌త్రుల‌కు ఎందుకు త‌ర‌లించ‌ర‌ని ప్ర‌శ్నించారు.

    మ‌న‌షులు చ‌నిపోయిన త‌ర్వాత ప‌రిశ్ర‌మ‌లు ఎందుకంటూ నిల‌దీశారు. మ‌నుషుల ప్రాణాల కంటే ప‌రిశ్ర‌మ‌లు ముఖ్యం కాద‌ని, ప్ర‌జ‌ల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాద‌ని తిట్టిపోశారు. టాటా కంపెనీలు త‌మ స్టీల్ ప్లాంట్ల నుంచి ఆక్సీజ‌న్ ను త‌ర‌లించే ఏర్పాట్లు చేస్తుంటే మీరెందుకు మౌనంగా ఉన్నారంటూ కేంద్రాన్ని కోర్టు ప్ర‌శ్నించింది. ఆక్సీజ‌న్ ను దేశంలోని అన్ని ప్రాంతాల‌కు త‌ర‌లించాల్సిన అవ‌స‌రం మీకు లేదా అంటూ నిల‌దీసింది. ప్ర‌జ‌ల ప్రాణాల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించండి… ప‌రిశ్ర‌మ‌ల‌కు ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రాను నిలిపివేసి, ఆస్ప‌త్రుల‌కు ఆక్సీజ‌న్ ను త‌ర‌లించండి అంటూ ఆదేశించింది.

     

    ఇవీ చదవండి

    టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

    10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

    ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

    విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.