కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ రికార్డ్.

  0
  309

  దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుంటే ఒక‌ర‌కంగా మోడీ స‌ర్కార్ చేతులెత్తేసింది. ప్ర‌పంచంలో ఏ దేశంలోనూ ఇంత‌వ‌ర‌కు లేనంత ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితుల్లో మ‌న దేశం నిలిచింది. వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుప్ప‌కూలిపోయాయి. ఆక్సీజ‌న్ లేదు… మందులు లేవు… ఆస్ప‌త్రుల్లో బెడ్లు లేవు… ప‌ట్టించుకునేవారు లేరు… చివ‌ర‌కు నిన్న ఒక్క‌రోజే ప్ర‌పంచంలో ఇంత‌వ‌ర‌కు ఏ దేశంలోనూ లేనంత ఎక్కువ సంఖ్య‌లో క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా ప్ర‌పంచంలో విరుచుకుప‌డిత త‌ర్వాత గ‌తేడాది జ‌న‌వ‌రి 8న అమెరికాలో ఒక్క‌రోజులోనే 3 ల‌క్ష‌ల 13వేల 310 కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఇదే ప్ర‌పంచ రికార్డ్. ఇప్పుడు భార‌త‌దేశం దాన్ని అధిగ‌మించింది. ఒక్క‌రోజులోనే 3 ల‌క్ష‌ల 14వేల 835 కేసులు న‌మోద‌య్యాయి. చాలా రాష్ట్రాల్లో శ్మ‌శానాల్లో ఖాళీ లేని ప‌రిస్థితి. ఇంత జ‌రుగుతున్నా రాజ‌కీయ‌పార్టీల నేత‌లు మాత్రం ఎన్నిక‌ల ప్ర‌చారంలో మునిగి తేలుతున్నారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే చేతులెత్తేశారు. అమెరికా ఛాన‌ల్స్ చెప్పిన‌ట్లు క‌రోనా అదుపు చేసే బాధ్య‌త‌ను కేంద్రం రాష్ట్రాల‌కు వ‌దిలేసింది. రాష్ట్రాలు జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు వ‌దిలేశాయి. జిల్లా క‌లెక్ట‌ర్లు ఆర్డీవోల‌కు వ‌దిలేశారు. ఆర్డీవోలు ఎమ్మార్వోల‌కు వ‌దిలేశారు. ఎమ్మార్వోలు శ‌శ్మానాల‌కు వ‌దిలేశారు. ఇది నేటి భార‌త‌దేశంలో క‌రోనా దారుణ ప‌రిస్థితి. ఈ వాస్త‌వ ప‌రిస్థితులు ఎవ‌రికి వారు మాస్కులు ధ‌రించి, సామాజికదూరం పాటించి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలే త‌ప్ప‌, చేయ‌గ‌లిగిందేమీ లేదు.

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.