సముద్రతీరంలో వేలాదిగా చచ్చిన చేపలు..

  0
  427

  ఉన్నట్టుండి ఒక్కసారిగా వేలాది చేపలు చనిపోయి సముద్రం నుంచి బయటపడుతున్నాయి. దీంతో తీరప్రాంత వాసులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ లోని దిఘా బీచ్ దగ్గర జరిగింది. దిఘా బీచ్ పర్యాటకులకు ఎంతో ప్రసిద్ధి. ప్రస్తుతం కొవిడ్ కారణంగా పర్యాటకుల తాకిడి తగ్గింది కానీ ఒక‌ప్పుడు ఈ బీచ్ పర్యాటకులకు బెస్ట్ స్పాట్. అయితే ఇప్పుడు దిఘా బీచ్‌ కు భారీ సంఖ్య‌లో చ‌నిపోయిన చేప‌లు కొట్టుకొస్తున్నాయి. సోమవారం పెద్ద ఎత్తున పఫర్ చేపలు తీరానికి కొట్టుకొచ్చాయి. పర్యావరణవేత్తలు చేపలు చనిపోయి కొట్టుకురావడం వెనుక కారణాలను అన్వేషిస్తున్నారు. చనిపోయి తీరానికి వచ్చిన చేపలు మళ్లీ సముద్ర నీటిలో కలువకుండా జాగ్రత్తపడాలని సూచించారు. చనిపోయిన చేపలు మ‌ళ్లీ సముద్రంలో కలిస్తే సముద్రం నీరు కలుషితం అవుతుందని హెచ్చ‌రించారు. దాంతో అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగి తీరంలో చ‌నిపోయిన చేప‌ల‌ను తీసేస్తున్నారు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..