కొన్ని సందర్భాల్లో పోలీసులు అద్భుతంగా పని చేస్తారు. ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తారు. తమిళనాడులోని పట్టుకొట్టై ప్రాంతంలో ఒక దొంగ.. కారును దొంగిలించి తీసుకెళుతుండగా, కారు యజమాని చోరీ జరుగుతుందని గుర్తించి పక్కనే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కి ఫిర్యాదు చేశాడు. దీంతో అప్రమత్తమైన కానిస్టేబుల్… ఆ దొంగను పట్టుకునేందుకు పరుగుతీశాడు. పోలీసు రాకను గుర్తించిన దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. అయినా వదలని పోలీసు, దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ లోగా మరో కారు అడ్డు రావడంతో పోలీసు కిందపడ్డాడు. అయినా వెనుతిరిగి చూడకుండా దొంగను పట్టుకునేందుకు యమస్పీడుగా పరుగుతీసి ఎట్టకేలకు పట్టుకున్నాడు. ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న ఈ పోలీసును నెటిజన్లు తెగ పొగుడుతున్నారు.
— Ravali Priya G (@rava_gandham) September 16, 2021