ఆ ఫోన్ కాల్ రాకపోయి ఉంటే..?

  0
  64

  మృత్యువు ఒక్కొక్కప్పుడు ఒక్కో రూపంలో ముంచుకొచ్చింది. అలా ఆ కుర్రాడికి ఫోన్ కాల్ రూపంలో వచ్చింది మృత్యువు. సరదాగా స్నానానికి వెళ్దామని స్నేహితుడు ఫోన్‌ చేయడంతో వెళ్లిన ఆ బాలుడికి అదే చివరి ఫోన్ కాల్ అయింది. స్నేహితుడితో కలసి వెళ్లి నీటమునిగి చనిపోయాడు. ఈ ఘటన సీతానగరంలో జరిగింది. సీతానగరం మండలంలోని ఇనుగంటివారిపేటకు చెందిన సలాది మణికంఠ(17) ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి గోదావరి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..స్నేహితుల దినోత్సవం కావడంతో ఆ రోజంతా స్నేహితులతో కలిసి సాయంత్రం వరకు ఆనందంగా గడిపాడు. ఈ క్రమంలో స్నానానికి వెళదామంటూ స్నేహితుడు విజయకుమార్‌ ఫోన్‌ చేయడంతో ఇంట్లో నిద్రిస్తున్న మణికంఠ లేచి.. మరో స్నేహితుడు శంకరంతో కలిసి మునికూడలి-రాజంపేటకు మధ్యలో ఉన్న నదిలో స్నానానికి దిగారు. ఆ ప్రాంతమంతా గోతులు ఉండడం, ప్రవాహ వేగానికి మణికంఠ స్నేహితుల కళ్ల ముందే కొట్టుకుపోయాడు. చుట్టుపక్కలవారు వెంటనే స్పందించి పొడవైన కర్రలు అందించడంతో మిగిలిన ఇద్దరు బయటపడ్డారు. రాత్రయినా కొడుకు ఇంటికి రాకపోవడంతో ఆరా తీస్తే నదిలో గల్లంతయినట్లు తెలిసింది.
  చెల్లెలి చదువుకోసం బైక్ మెకానిక్ గా మారి..
  మణికంఠ తండ్రి వీరవెంకట సత్యనారాయణ తాపీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి వెంకటలక్ష్మి ఒక ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్నారు. పదో తరగతి పూర్తిచేసిన మణికంఠ ఇంటర్‌ చదవాలనే ఆశ ఉన్నా చెల్లెలు కీర్తి(12) చదువు కోసం తన చదువు ఆపేశాడు. మోటార్‌ సైకిల్‌ మెకానిక్‌ దగ్గర పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. తాను చదవకపోయినా చెల్లిని ఉన్నతస్థితిలో నిలబెట్టాలని తరచూ తమతో అనేవాడని చెబుతూ తల్లిదండ్రులు విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?