నాన్నా , నువ్వు నీచుడవు.. ఐ హేట్ యు..

  0
  1556

  కన్నకూతురు , నాన్నా నిన్ను , నాన్నా అనిపిలిస్తేనే పాపం చుట్టుకుంటుందేమో , నాన్న అన్న పదానికే అది కళంకమేమో , బ్యాడ్ డాడీ , అంటూ తల్లికూడా లేని 16 ఏళ్ళ కూతురు చనిపోయేముందు రాసిందంటే , వాడేంత నీచుడో , దుర్మార్గుడో వివరించాల్సిన పనిలేదు. పదో తరగతి చదివే 16 ఏళ్ళ చిన్నారి పేరు మనీషా.. మహబూబ్ నగర్ జిల్లా బుగ్గానిగూడలో , మనీష , పదోతరగతి పరీక్షలకు ఒక రోజు ముందే మనీషా ఆత్మహత్యచేసుకుంది..

  అప్పుడు రకరకాల కారణాలు చెప్పారు. అయితే , ఇప్పుడు ఆ బాలిక పుస్తకాలు , నోట్ బుక్స్ పరిశీలిస్తుంటే , తండ్రి రాక్షసత్వం బయటపడింది. చనిపోక రెండురోజులు ముందునుంచే , ఆ బాలిక బ్యాడ్ డాడీ అని నోట్ బుక్ లో రాసిఉంది. మరోదగ్గర చావుకోసం ఎదురు చూస్తున్నాను అని రాసింది. మరికొన్ని రోజులలో నేను చనిపోతున్నానని కూడా రాసింది.

  మనీషా తల్లి లలిత ఏడాదిక్రితం చనిపోయింది. భర్త నర్సింహులు తాగుబోతు. భార్య చనిపోయినప్పటినుంచి , తాగుడు ఎక్కువై , బిడ్డల్ని కూడా వేధించేవాడు.. తండ్రితో వేగలేకనే , మనీషా ఆత్మహత్యచేసుకుంది.. మానాన్న అంటే నాకు అసహ్యం , మా అమ్మఅంటే నాకు ఇష్టం.. అంటూకూడా రాసుకుంది..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..