ఉన్నపళంగా కరోనా ఎంత భయానకంగా తయారయ్యిందో చేకోస్లీవేకియా అధ్యక్షడిని చూడండి. 77 ఏళ్ళ దేశాధ్యక్షుడు మిలాస్ జిమెన్ కొత్త ప్రధానిని నియమించే కార్యక్రమాన్ని , ఒక గాజు ఛాంబర్ నుంచి చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఈ గాజు ఛాంబర్ ను ఏర్పాటుచేశారు. దేశాధ్యక్షుడు ఇప్పుడు కోవిద్ తో బాధపడుతున్నాడు. ఆయన ఇప్పడు ఇంట్లో ఎక్కడున్నా గ్లాస్ ఛాంబర్ లోనే ఉంటాడు. బెడ్ , బాత్ , లివింగ్ , డైనింగ్ ఇలా అన్ని గదులు గ్లాస్ తోనే ప్రత్యేకంగా తయారుచేశారు. ఆయనకోసం పనిచేసే వైద్య సిబ్బంది బయటకు ఎక్కడకూ పోకూడదు.. అధ్యక్ష భవనంలోనే ఉండాలి.. ఇన్ని జాగ్రత్తలతో ఉన్నా ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్దారించారు..