జగనన్న లాప్ టాప్ కావాలా .? ఇలా చెయ్యండి.

  0
  419

  సీఎం జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన జ‌గ‌న‌న్న అమ్మ ఒడి ప‌ధ‌కంలో ఇచ్చే 15వేల రూపాయ‌ల‌కు బ‌దులు ల్యాప్ టాప్ ఎవ‌రికి కావాలో గుర్తించాలంటూ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. 9 నుంచి ఇంట‌ర్ విద్యార్ధుల‌కు డ‌బ్బులు బ‌దులు ల్యాప్ టాప్ కోరుకుంటే ఇస్తాన‌ని గ‌తంలో సీఎం జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ఈ హామీ మేర‌కు ఇప్పుడు ల్యాప్ టాప్ కావాల్సిన వారు త‌మ వివ‌రాల‌ను తెల‌పాలంటూ ఈ ప‌ధ‌కం వ‌ర్తించే త‌ల్లుల‌కు జగ‌న్ ఒక లేఖ రాశారు. ఈ లేఖ‌ను సంబంధిత స్కూళ్ళ‌ల్లో ఈనెల 15వ తేదీ లోప‌ల అందించాల‌న్నారు. ఆ త‌ర్వాత 19వ తేదీ ఈ ప‌ధ‌కం కింద‌కు వ‌చ్చే విద్యార్ధుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి, ఆ వివ‌రాల‌ను స్కూల్ సిబ్బంది విద్యార్ధుల‌కు వివ‌రిస్తారు. విద్యార్ధులు ఈ లేఖ‌ను తీసుకెళ్ళి త‌ల్లిదండ్రుల అభిప్రాయాల‌ను తెలుసుకుని, ఆ వివ‌రాల‌ను 22వ తేదీ స్కూల్ హెడ్మాస్ట‌ర్ల‌కు ఇవ్వాలి. 26వ తేదీ ల్యాప్ టాప్ కోరుకున్న విద్యార్ధుల జాబితాను ఆన్ లైన్ లో పెడ‌తారు.

   

  https://ndnnews.in/supermoon-helped-ship-to-float/

  https://ndnnews.in/ram-charan-reaction-on-vakeel-saab-trailer/

  https://ndnnews.in/2bride-elopes-cheating-on-5-grooms/

   

  https://youtu.be/eZMv2ZOmhLk