భర్తను వేధించింది చాలు..ఇక విడాకులు తీసేసుకో..కోర్టు తీర్పు.

  0
  845

  నీ భర్త నువ్వు చెప్పినట్టు చేయలేదని , తప్పుడు కేసులు పెట్టావు.. వేదించావ్.. అత్తమామలు , వరకట్న వేధింపులంటూ అబద్దాలు చెప్పావ్.. తొమ్మిదినెలల వైవాహిక జీవితంలో అతడికి నరకం చూపించావు.. భర్త జీవితాన్ని దయనీయం చేసావు.. ఇక చాలు విడాకులు ఇచ్చేస్తున్నామంటూ నాగ్ పూర్ హైకోర్టు బెంచ్ ఓ కేసులో విడాకులు ఇచ్చింది. విడాకులు ఇవ్వకముందే , భార్య తనకు రెండో పెళ్ళికి వరుడు కావాలంటూ రెండు మాట్రిమోనియాల్ వెబ్ సైట్స్ లో ప్రకటనకూడా ఇచ్చింది. విడాకుల కేసు పెండింగ్ లో ఉండగా , పెళ్ళికి అంతతొందరెందుకని కూడా కోర్టు భార్యను నిలదీసింది. గతంలోనే పెళ్ళైన తొమ్మిదినెలలకు , భార్య చేతిలో నరకం చూసిన భర్త , సర్దుబాటుకు ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. ఉద్యోగం మానేసి , తనతో తన తల్లి ఉండే అకోలా కు రావాలని పోరుపెట్టింది. అతడు వినకపోవడంతో , తల్లి ఇంటికి వెళ్ళిపోయి , రకరకాల కేసులు పెట్టి వేధించింది. చివరకు విడాకులకేసు కోర్టులో ఉన్నప్పుడే , రెండో పెళ్ళికి భర్త కావాలని ప్రకటన చేసింది..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్