వికలాంగుడైన భర్తను హింసించి , తప్పుడు కేసులతో వేధించిన భార్యకు పంజాబ్ హర్యానా హైకోర్టు చీవాట్లు పెట్టింది. భర్తను నువ్వు పెట్టిన చిత్రహింసలు ఇక చాలు , నువ్వు పెట్టే బాధలకు అతను చిక్కి శల్యమైపోయాడు.. మానసిక వేదనతో ఆరోగ్యం నాశనం చేసుకున్నాడు, 25 కిలోల బరువుకూడా తగ్గిపోయాడు.. అతడు కోరిన విధంగా విడాకులు ఇచ్చేస్తున్నామని కోర్టు చెప్పింది. పేద ఇంటినుంచి భార్యను తెచ్చుకున్న వికలాంగ భర్త బ్యాంకులో పనిచేస్తున్నాడు. భార్యకు పెళ్ళైన తరువాత స్వంత డబ్బులతో ఉన్నత చదువులు చెప్పించాడు.. ఆమెకు ఒక స్కూల్లో ఉద్యోగం వచ్చింది. అప్పటినుంచి భర్తపై వేధింపులు మొదలు పెట్టింది. అత్తా, మామలను ఇంటినుంచి తరిమేయ్యమని పోరుపెట్టేది. తప్పుడు కేసులతో వేధించేది . బిడ్డను వదిలేసి ఇంటినుంచి వెళ్ళిపోయి , అదే పనిగా కేసులు పెడుతూ చిత్ర హింసలు పెట్టింది. చివరకు ఆమె పెట్టే బాధలు భరించలేని భర్త , ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్ప్లై చేసాడు. ఫ్యామిలీ కోర్టు కూడా , ఆమెదే తప్పు అని విడాకులు ఇచ్చింది. దీనిపై ఆమె హైకోర్టుకు పోయింది. హైకోర్టులో కేసు విచారించి , ఆమెకు చీవాట్లు పెట్టారు. భర్తను , బిడ్డను వదిలేసి తప్పుడు కేసులు పెట్టావంటూ మందలించి కింది కోర్టు తీర్పును ఖరారు చేశారు..
ఇవీ చదవండి..