లేడీ డాక్టర్ పై పగబట్టిన కరోనా

  0
  2360

  కరోనా ఎవరికైనా ఒకసారి వచ్చిపోతే రెండోసారి రావొచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా శరీరంలోని యాంటీబాడీల పనితీరు తగ్గిపోయి కాస్త టైమ్ తీసుకుంటుంది. కానీ ఓ లేడీ డాక్టర్ కి మాత్రం ఏడాది కాలంలో ఏకంగా మూడుసార్లు కరోనా కాటు వేసింది. విచిత్రం ఏంటంటే.. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా ఆమెకు రెండుసార్లు కరోనా వచ్చింది.
  డాక్టర్ శృష్టి హలరి. 26ఏళ్ల ఈ యువ వైద్యురాలు ముంబైలోని సావర్కర్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది జూన్ 17 వ తేదీన ఆమె వైరస్ బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో వెంటనే పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆ తర్వాత చికిత్స తీసుకుని కోలుకుంది. ఇక ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో ఆమెతో పాటు కుటుంబ సభ్యులందరూ రెండు డోసుల టీకాలు తీసుకున్నారు.
  రెండోసారి..
  ఈ ఏడాది మే 29 తేదీన మరోసారి ఈమెకు కరోనా సోకింది. ఆ సమయంలో కూడా ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఇక కోలుకున్నారామె.
  ముచ్చటగా మూడోసారి…
  ఇటీవలే జూన్ 11వ తేదీన మరోసారి ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈసారి వైద్యురాలి తో పాటు ఆమె కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్ వచ్చింది. ఇలా 13 నెలల వ్యవధిలో మూడు సార్లు కరోనా వైరస్ బారిన పడింది ఆ డాక్టర్. మూడోసారి వైరస్ ఎంతగానో ఇబ్బంది పెట్టిందని, తనతో పాటు కుటుంబ సభ్యులంతా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపిందామె. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నా, వైద్యురాలిగా తగు జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆమె మూడుసార్లు వైరస్ బారిన పడటం గమనార్హం.

   

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?