బిర్యానీ గొడవ కలెక్టర్ కి నోటీసు..

  0
  210

  ఒక జాతరలో బిర్యానీ గొడవ ఆ జిల్లా కలెక్టర్ కి తలనొప్పి తెచ్చింది. తలనొప్పి తేవడమే కాదు కలెక్టర్ కు నోటీసులు జారీచేసే పరిస్థితి వచ్చింది. దీంతో ఈ వివాదం ముదిరింది . ఇంతకీ ఈ బిర్యానీ గొడవ జరిగింది తమిళనాడు రాష్ట్రంలో . తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా ఆంబూరు జాతర జరుగుతుంది. తమిళ్ నాడులో ఈ ఆంబూరు జాతర చాలా ఫేమస్. ఈ జాతర లో సంప్రదాయంగా ఇరవై రకాల బిర్యానీలుతో స్టాల్ల్స్ ఏర్పాటు చేస్తారు.

  వీటిలో గొడ్డు మాంసం అంటే బీఫ్, పంది మాంసం అంటే పోర్క్ బిర్యానీలు కూడా వండి వడ్డిస్తారు. వీటికోసమే సెపెరేట్ స్టాల్ల్స్ ఉంటాయి. అన్నిరకాల నాన్ వెజ్, వెజ్ బిర్యానీ లకు లేని అభ్యంతరం గొడ్డు మాంసం , పంది మాంసాలతో చేసే బిర్యానీలకు వచ్చింది. కలెక్టర్ తన ఆదేశాలలో , ఆంబూరు జాతరలో , గొడ్డు , పంది మాంసం బిర్యానీలు అమ్మకూడదని , వీటికోసం స్టాల్ల్స్ పెట్టకూడదని ఆదేశాలు ఇచ్చారు. ఈ జాతర 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగాల్సిఉంది.

  గొడ్డు మాంసం పంది మాంసం బిర్యానీ స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు లేదని జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు పై ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని వర్గాలు , నిరసనకు దిగాయి. ఎస్సి ఎస్టీ కమీషన్ ను ఆశ్రయించాయి. దీంతో ఎస్సి ఎస్టీ కమీషన్ కలెక్టర్ కు నోటీసు జారీ చేసింది. గొడ్డు , పంది మాంసం బిర్యానీలు ఎలా ఆపుతారని నిలదీసింది. ఇది ఎస్సీ ఎస్టీల ను కించపరిచే చర్యని ,ఇది ఒక రకంగా అంటరానితనం లాంటి నేరమని , దళితులపై దళితుల పట్ల వివక్షత కిందకే వస్తుందని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసింది ..

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.