బీజేపీ నేత చెంప‌చెళ్ళుమ‌నిపించాడు.

  0
  63

  మ‌హారాష్ట్రంలో బీజేపీ నేత చెంప‌చెళ్ళుమ‌నిపించాడు. నేష‌న‌ల్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు, సీనియ‌ర్ నేత శ‌ర‌ద్ ప‌వార్‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ సెన్సేష‌న్ అయింది. దీనికి సంబంధించి మ‌రాఠీ సినీ, టీవీ న‌టి కేత‌కి మీద పోలీస్ కేస్ న‌మోదైంది. కోర్టులో హాజ‌రు ప‌ర్చ‌గా కోర్టు ఆమెను మూడు రోజుల పాటు విచార‌ణ కోసం పోలీస్ క‌స్ట‌డీకి అనుమ‌తించింది.

  త‌ర్వాత మ‌హారాష్ట్ర బీజేపీ అధికార ప్ర‌తినిధి వినాయ‌క్.. శ‌ర‌ద్ ప‌వార్‌పై పోస్టింగ్‌ను షేర్ చేశారు. ఈ విష‌మ‌యై అత‌న్ని ప్ర‌శ్నించేందుకు ఎన్‌సీపీ కార్య‌క‌ర్త‌లు పూణేలోని బీజేపీ కార్యాల‌యంలోకి వెళ్ళారు. అత‌నితో మాట్లాడుతుండ‌గానే ఓ కార్య‌క‌ర్త … వినాయ‌క్ పై దాడి చేసి చెంప ప‌గ‌ల‌గొట్టాడు.

  ఇందుకు సంబంధించిన ఓ వీడియోను బీజేపీ మ‌హారాష్ట్ర అధ్య‌క్షుడు చంద్ర‌కాంత్ పాటిల్ త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు. ఈ దాడిని ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ కూడా తీవ్రంగా ఖండించారు. శ‌ర‌ద్ ప‌వాల్ లాంటి సీనియ‌ర్ నాయ‌కుడిపై దుర్మార్గ‌మైనటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.