ప్రభాస్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్..

  0
  78

  హీరో ప్రభాస్ నక్కతోక తొక్కాడు. రాధేశ్యామ్ సినిమా కరోనా కాలం వల్ల బాగా లేటయింది కానీ.. ఏపీ సీఎం జగన్ సరిగ్గా సినిమా ముందు టికెట్ రేట్లు పెంచి ప్రభాస్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్.. నేనెందుకు వెనక్కి తగ్గాలనుకున్నారో ఏమో.. ఏకంగా సినిమా విడుదల తర్వాత రెండు వారాలపాటు స్పెషల్ షో కోసం అనుమతి ఇచ్చారు. అంటే ఫిబ్రవరి 11న సినిమా విడుదల అయితే 25వ తేదీ వరకు తెలంగాణలో రాధేశ్యామ్ ఐదో షో వేసుకోవచ్చనమాట.

  బాహుబలి (Bahubali) హీరో ప్రభాస్ (Prabhas) నుంచి వస్తోన్న చిత్రం రాధేశ్యామ్‌ (RadheShyam). ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు రాధా కృష్ణ ఈ సినిమాను భారీగా తెరకెక్కించారు. విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతోంది.

  వింటేజ్‌ ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటించింది. ఇందులో ప్రభాస్‌ హస్త సాముద్రికుడిగా కనిపిస్తాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలువుతోన్న ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..