మన బిడ్డల కోసం తమ బిడ్డలపై ప్రయోగం .

    0
    544

    ఈ ముగ్గురు బిడ్డ‌లు మ‌న బిడ్డ‌ల‌ను ర‌క్షించ‌డంలో వెలుగు రేఖ‌లు. చిన్న పిల్ల‌ల్లో కోవిడ్ వ్యాక్సిన్ ఎలాంటి ఫ‌లితాల‌ను చూపిస్తుందో తెలుసుకునేందుకు నిర్వ‌హిస్తున్న క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కు భార్యాభ‌ర్త‌లైన ఇద్ద‌రు డాక్ట‌ర్లు త‌మ బిడ్డ‌ల‌నే ప్ర‌యోగానికి సిద్ధం చేశారు. ఒక‌టి, మూడు, ఆరు సంవ‌త్స‌రాల వ‌య‌సున్న త‌మ పిల్ల‌ల‌కు క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కింద కోవిడ్ వ్యాక్సిన్ వేయిస్తున్నాడు. ఇప్ప‌ట‌వ‌ర‌కు 12 నుంచి 17 ఏళ్ళ‌లోపు పిల్ల‌ల‌పైనే ఫైజ‌ర్, మొడెర్నా వ్యాక్సిన్లు ప్ర‌యోగించారు.

    ఇప్పుడు లూజియానాకు చెందిన డాక్ట‌ర్ దంప‌తులు త‌మ పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ వేయించేందుకు సిద్ధం చేశారు. అనుకున్న‌ట్లుగానే తొలి విడ‌త డోసు కూడా వేయించారు. త‌మ బిడ్డ‌ల‌తో పాటు ప్ర‌పంచంలోని అంద‌రి బిడ్డ‌ల ఆరోగ్యం కోసం త‌మ బిడ్డ‌ల‌పైనే ప్ర‌యోగాలు చేసేందుకు సిద్ధ‌మ‌య్యామ‌ని తెలిపారు. ఇది త‌మ అదృష్టంగా భావిస్తున్నామ‌ని అన్నారు. ప్ర‌పంచ మాన‌వాళికి పెనుభూతంగా మారిన ఈ మ‌హ‌మ్మారి అంతానికి విస్తృత ప్ర‌యోగాలు జ‌ర‌గాల్సి వుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.