కరోనా మరణాలను కొలెస్ట్రాల్ మాత్రలు తగ్గిస్తాయా?

    0
    191

    కొలెస్ట్రాల్ తగ్గేందుకు వాడే స్టాటిన్ రసాయనం ఉండే మాత్రలు కొవిడ్ పై పోరాటం చేస్తాయా..? ఈ మాత్రలు వాడేవారిలో 41శాతం మంది తీవ్రమైన కొవిడ్ బారినుంచి బయటపడ్డారని, వాటిలో మరణం తప్పేందుకు కొలెస్ట్రాల్ నివారణకు వాడే స్టాటిన్ వారు వాడుతుండటమే కారణం అని ఓ పరిశోధన తేల్చింది. కరోనా ఇన్ఫెక్షన్ తీవ్రతను ఈ స్టాటిన్స్ తగ్గిస్తాయని శాండియాగోలోని పరిశోధనా సంస్థ నిర్థారించింది. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఉపయోగించే ఈ మాత్రలు రక్తనాళాలు పూడుకుపోకుండా గుండె జబ్బులు నివారించేందుకు ఉపయోగిస్తారు. రక్తంలోని ఎల్డీఎల్ కొలెస్ట్రాల్, ఇన్ఫెక్షన్ పెంచేందుకు సహకరిస్తుంది. ఈ స్టాటిన్స్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తాయి కాబట్టి, కరోనా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను ఇవి తగ్గించగలిగే స్థాయికి చేరుకుంటాయి.

    ఈ పరిశోధనను శాండియాగోలోని గుండె జబ్బుల విభాగం డైరెక్టర్ లోని డేరియల్ నిర్వహించారు. కరోనా వైరస్ కి గేట్ వే లాంటి ఎసిఇ-2 ఎంజైమ్ లను నిరోధించడంలో కూడా ఈ కొలెస్ట్రాల్ మాత్రలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. కరోనా వైరస్ పైన ఉండే కిరీటాల్లాంటి వాటిని ఎస్ ప్రొటీన్ లు అంటారు. ఈ ఎస్ ప్రొటీన్లే ఎసిఇ-2 ఎంజైమ్ లను మానవ కణాలతో అనుసంధానం చేస్తాయి. కిరీటంలాంటి ఈ ఎస్ ప్రొటీన్లను కూడా నాశనం చేయడంలో కొలెస్ట్రాల్ మందులు సమర్థవంతంగా పనిచేశాయని నిర్థారణ అయింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నుంచి సేకరించిన డేటా కూడా స్టాటిన్స్ మాత్రలు కరోనా ప్రభావాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయని తేలింది.

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?