చిరంజీవి కొత్త సినిమా పేరు ఖరారు..

  0
  60

  చిరంజీవి కొత్త సినిమా పేరు ఖరారు చేశారు. ఆచార్య తర్వాత ఆయన చేస్తున్న సినిమా ఇదే. లూసిఫర్ అనే మళయాల బ్లాక్ బస్టర్ కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే పేరు ఖరారు చేశారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ముందుగానే ప్రీలుక్‌ విడుదల చేశారు. టైటిల్ అనౌన్స్ చేశారు. చిరంజీవి నటిస్తున్న 153వ సినిమా ఇది. టైటిల్, ప్రీ లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

  కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌గుడ్‌ ఫిల్మ్ష్‌ పతాకంపై ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ మ్యూజిక్ డైరెక్టర్. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా వస్తున్న చిరు 153వ చిత్రంలో పలువురు స్టార్స్‌ కనిపిస్తారు. యంగ్ హీరో సత్యదేవ్‌ కి మంచి పాత్ర దొరికింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి మరో రెండు సినిమాలు చేయాల్సి ఉంది.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..